Breaking News

ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో.. హెడ్‌కోచ్‌గా

Published on Wed, 11/08/2023 - 21:35

Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్‌ మాజీ హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్టుకు అతడు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు.

కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా సేవలు అందించిన మైక్‌ హసన్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

ఈ క్రమంలో ఐపీఎల్‌ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్‌ స్టార్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ గెలిచిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.

కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్‌ జట్టు నాలుగుసార్లూ నాకౌట్‌ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్‌ అజర్‌ మహ్మూద్‌పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్‌ హసన్‌తో భర్తీ చేసింది.

సంతోషంగా ఉంది
ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్‌ హసన్‌.. ‘‘ఇస్లామాబాద్‌ యునైటెడ్‌లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్‌, ఎంపవర్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌.. ఇలా నాలుగు E-లను  ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్‌తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు
కాగా గతంలో న్యూజిలాండ్‌తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్‌ హసన్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్‌ చేరుకుంది. కానీ టైటిల్‌ గెలవడంలో మాత్రం విఫలమైంది.   

చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్‌ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే!

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు