టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం

Published on Tue, 06/10/2025 - 16:54

తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల నయా ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం ఆర్‌ డి ప్రణవ్‌ రాఘవేంద్ర తనకు మాత్రమే సాధ్యపడుతున్న అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ టోర్నీలో గంటకు 147.3 కిమీ వేగంతో బంతిని సంధించి వార్తల్లో నిలిచాడు. భారత అండర్‌-19 క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. 

గత కొంతకాలంగా ప్రణవ్‌ ఇంచుమించు ఇదే స్పీడ్‌ను మెయిన్‌టైన్‌ చేస్తున్నాడు. ప్రణవ్‌ ఇదే కొనసాగిస్తే త్వరలో గంటకు 150 కిమీ స్పీడ్‌ను కూడా అందుకునే అవకాశం ఉంది. భారత ఫాస్ట్‌ బౌలింగ్‌కు సంబంధించి గంటకు 150 కిమీ స్పీడ్‌ అనేది చాలా అరుదైన మైలురాయి.

భారత ఫాస్ట్‌ బౌలర్లు ఈ స్పీడ్‌ను అంత ఈజీగా అందుకోలేరు. ఇప్పటివరకు మనం చూసిన వారిలో ఉమ్రాన్‌ మాలిక్‌, మయాంక్‌ యాదవ్‌ వంటి వారు ఈ స్పీడ్‌ పరిసరాల్లోకి చేరారు. ఈ స్పీడ్‌ను చేరుకోవడం​ ఓ ఎత్తైతే, దీన్ని నిలకడగా ప్రదర్శించడం మరో ఎత్తు. దీన్ని మెయింటైన్‌ చేయడం చాలా కష్టం. స్పీడ్‌ను సాధించే క్రమంలో తీవ్రమైన గాయాలవుతుంటాయి. ఒక్కోసారి కెరీర్‌లే అర్దంతరంగా ముగిసిపోతుంటాయి.

తాజాగా ఈ స్పీడ్‌ను అందుకొని, మెయింటైన్‌ చేయగల సామర్థ్యమున్న ఫాస్ట్‌ బౌలర్‌గా ప్రణవ్‌ కనిపిస్తున్నాడు. 150 కిమీ వేగాన్ని అందుకున్న వారిలో ప్రణవ్‌ అతి పిన్న వయస్కుడు. రెండేళ్లలో ప్రణవ్‌ 130 నుంచి 147 కిమీ వరకు వేగాన్ని పెంచుకోగలిగాడు. 

ఇదే అతనిపై అంచనాలను పెంచుతుంది. త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించబోయే భారత అండర్‌-19 జట్టుకు ఎంపికైన ప్రణవ్‌.. అదే పర్యటనలో గంటకు 150 కిమీ వేగాన్ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అతని చూసిన వారంటున్నారు. ఈ చెన్నై స్పీడ్‌ గన్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు ఆడనున్నాడు. ఈ సిరీస్‌లు జూన్‌ 27 నుంచి మొదలుకానున్నాయి.

ప్రస్తుతం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో శిక్షణలో ఉన్న ప్రణవ్‌ తన భవిష్యత్‌ లక్ష్యాల గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. నాకు వేగంగా బౌలింగ్‌ చేయడమంటే చాలా ఇష్టం. రాకాసి బౌన్సర్లతో బ్యాటర్లను భయపెట్టడాన్ని చాలా ఇష్టపడతాను. విపరీతమైన వేగంతో బ్యాటర్ల గ్లోవ్స్‌ను టార్గెట్‌ చేస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. 

ఈ స్పీడ్‌ను కొనసాగించేందుకు ఖచ్చితత్వంతో సహా చాలా అంశాలపై పని చేయాలి. టీమిండియాకు ఆడటమే నా లక్ష్యమని అన్నాడు. కొసమెరుపు ఏంటంటే.. ప్రణవ్‌కు ఫాస్ట్ బౌలింగ్ మొదటి ప్రేమ కాదు. చిన్నతనంలో అతను స్ప్రింటర్ కావాలని అనుకున్నాడు. టీనేజ్‌లోకి అడుగుపెట్టకముందే 100 మీటర్ల రేసును 13.76 సెకెన్లలో పూర్తి చేశాడు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)