వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌

Published on Mon, 10/30/2023 - 21:55

వన్డే ప్రపంచకప్‌-2023లో అఫ్గానిస్తాన్‌ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ చిత్తు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్‌), ఒమర్జాయ్‌(72 నాటౌట్‌), రెహమత్‌ షా(62) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు, రజితా ఒక్క వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సంక(46),కుశాల్‌ మెండిస్‌ (39), సమరవిక్రమ (36) టాప్‌ స్కోరర్లగా నిలిచారు.

ఆఫ్ఘన్‌ బౌలర్లలో ఫజల్‌ హక్‌ ఫారూఖీ 4, ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇక ఈ విజయంతో అఫ్గాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది.  కాగా వన్డే వరల్డ్‌కప్‌లలో శ్రీలంకపై అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.  అదే విధంగా ఈ టోర్నీలో అంతకుముందు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ వంటి మేటి జట్లను అఫ్గాన్‌ మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
చదవండి: World Cup 2023: పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో వివాదం.. బాబర్‌ ఆజం ప్రైవేట్ చాట్‌ లీక్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)