Afghanistan T20 WC Squad: టీ20 వరల్డ్‌‍కప్‌లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్పిన్‌ మాంత్రికుడు

Published on Wed, 05/01/2024 - 10:34

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా స్పిన్‌ మాంత్రికుడు రషీద్‌ ఖాన్‌ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల యువ వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ ఇషాక్‌, 20 ఏళ్ల స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నంగ్యాల్‌ ఖరోటిలకు వరల్డ్‌కప్‌ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. 

గత వరల్డ్‌కప్‌లో ఆడని కరీం జనత్‌, నూర్‌ అహ్మద్‌లకు ఈసారి అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ల ప్రధాన బలమైన స్పిన్ విభాగంలో రషీద్‌ ఖాన్‌తో పాటు మొహమ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌ ఉన్నారు. పేసర్ల విభాగంలో నవీన్‌ ఉల్‌  హాక్‌, ఫరీద్‌ అహ్మద్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యారు. 

వికెట్‌కీపర్ల కోటాలో రహ్మానుల్లా గుర్భాజ్‌ జట్టులోకి రాగా.. స్పెషలిస్ట్‌ బ్యాటర్లుగా ఇబ్రహీం జద్రాన్‌, నజీబుల్లా జద్రాన్‌ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల కోటాలో కరీం జనత్‌, గుల్బదిన్‌ నైబ్‌, హజ్రతుల్లా ఒమర్‌జాయ్‌ వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చారు. సెదిక్‌ అటల్‌, హజ్రతుల్లా జజాయ్‌, సలీం సఫీ ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.

జూన్‌ 1 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పోరాటం జూన్‌ 3న మొదలవుతుంది. ఆ రోజు గయానా వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఉగాండతో తలపడతారు. జూన్‌ 7న ఇదే వేదికపై వీరు పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొంటారు.  గ్రూప్‌-సిలో ఆఫ్ఘనిస్తాన్‌.. వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లతో పోటీపడుతుంది. 

టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్‌కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్‌), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్

ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: సెదిక్‌ అటల్‌, హజ్రతుల్లా జజాయ్‌, సలీం సఫీ

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)