ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ను శిక్షించిన ఐసీసీ.. ఎందుకంటే?

Published on Tue, 10/17/2023 - 18:28

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌పై ఆఫ్గానిస్తాన్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్‌ 15న ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఆఫ్గాన్‌ చిత్తు చేసింది. కాగా ఈ మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ బిగ్‌ షాకిచ్చింది.  ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్‌-1 నిబంధన ఉల్లఘించినందుకు రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఐసీసీ మందలించింది.

గుర్భాజ్‌ ఏం చేశాడంటే?
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గుర్భాజ్(57 బంతుల్లో 80) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మంచి ఊపు మీద ఉన్న గుర్భాజ్‌ దురదృష్టవశాత్తూ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో అసహనానికి లోనైన గుర్భాజ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తూ తన బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను, కూర్చీని బలంగా కొట్టాడు. 

అయితే ఆర్టికల్‌ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనల ప్రకారం ఆటగాడు మ్యాచ్‌ సమయంలో గ్రౌండ్‌కు సంబంధించిన పరికరాలను ద్వంసం చేయడం, హెల్మెట్‌ను నెలకేసి కొట్టడం వంటివి చేయకూడదు. ఈ నేపథ్యంలోనే గుర్భాజ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. 

ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్‌ పాయింట్స్‌ విధించే అవకాశం ఉంటుంది. కాగా గుర్భాజ్‌ కూడా తన నేరాన్ని అంగీకరించాడు.
చదవండి: WC 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌ ఆటగాళ్లకు వైరల్‌ ఫీవర్‌!

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)