Breaking News

మ్యాచ్‌ ఫిక్సింగ్‌: అఫ్గన్‌ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం

Published on Wed, 08/07/2024 - 17:24

టాపార్డర్‌ బ్యాటర్‌ ఇహ్సనుల్లా జనత్‌పై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు అతడిని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది.

కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇహ్సనుల్లా జనత్‌.. అఫ్గన్‌ తరఫున ఇప్పటి వరకు మూడు టెస్టులు, 16 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడాడు. 26 ఏళ్ల ఈ టాపార్డర్‌ బ్యాటర్‌.. టెస్టుల్లో 110, వన్డేల్లో 307, టీ20లో 20 పరుగులు సాధించాడు. ఎంత వేగంగా జాతీయ జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా దూరమయ్యాడు కూడా!

ఈ క్రమంలో 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌(టీ20) ఆడిన ఇహ్సనుల్లా.. ఇటీవల కాబూల్‌ ‍ప్రీమియర్‌ లీగ్‌లో భాగయ్యాడు.  2024 సీజన్‌లో షంషాద్‌ ఈగల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. నాలుగు ఇన్నింగ్స్‌ ఆడి 72 పరుగులు చేశాడు. అయితే, అతడు ఫిక్సింగ్‌ పాల్పడ్డాడన్న ఆరోపణలు రాగా.. క్రికెట్‌ బోర్డు విచారణ చేపట్టింది.

ఈ క్రమంలో ఇహ్సనుల్లా జనత్‌ దోషిగా తేలాడు. తన తప్పును అంగీకరించాడు. ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిలోని 2.1.1 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా అతడిపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గన్‌ బోర్డు తెలిపింది. మ్యాచ్‌ ఫలితాలు, మ్యాచ్‌ సాగే తీరును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడ్డందుకు వేటు వేసినట్లు పేర్కొంది.

కాగా అఫ్గనిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ నవ్రోజ్‌ మంగల్‌ తమ్ముడే ఇహ్సనుల్లా. అఫ్గన్‌ జట్టుకు వన్డే హోదా వచ్చినపుడు నవ్రోజ్‌ సారథిగా ఉన్నాడు. అతడి కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్‌-2010 ఎడిషన్‌కు అఫ్గనిస్తాన్‌ జట్టు అర్హత సాధించింది. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)