Breaking News

పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెట‌ర్ల మృతి

Published on Sat, 10/18/2025 - 07:26

అఫ్గానిస్తాన్ క్రికెట్‌(Afghanistan) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాక్ సరిహద్దులోని తూర్పు పాక్తిక ప్రావిన్స్‌లో పాకిస్తాన్(Pakistan) సైన్యం జ‌రిపిన బాంబు దాడిలో ముగ్గురు అఫ్గాన్‌ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు.  ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది.

అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకారం.. ఆటగాళ్లు తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుండి షరానాకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన క్రికెటర్లను కబీర్‌, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైనం కృరత్వానికి వారు బలై అయిపోయారు.

ఈ దాడిలో క్రికెటర్లతో మరో ఐదుగురు అఫ్గాన్‌ పౌరులు సైతం ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కారణంగా నవంబర్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌తో జరిగాల్సిన  ట్రై సిరీస్‌ నుంచి అఫ్గానిస్తాన్‌ తప్పుకొంది.

"ఈ హృదయ విదారక ఘటనలో ఉర్గున్ జిల్లాకు చెందిన మా ముగ్గురు ఆటగాళ్లు కబీర్‌, సిబ్ఘతుల్లా, హరూన్‌లను కోల్పోయాము. ఉర్గున్ కు తిరిగి వచ్చాక ఓ సమావేశంలో ఈ దాడి జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి పంద చర్య. మా క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు మృతి చెందారు. 

వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. బాధితులకు గౌరవ సూచకంగా నవంబర్ చివరలో జరగనున్న పాకిస్తాన్‌తో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుండి వైదొలగాల‌ని నిర్ణ‌యించుకున్నాము అని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా అక్టోబర్ 11 నుంచి పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా..  ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం  ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు. 

ఇరువైపుల కూడా  పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే పాక్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)