Breaking News

వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన.. నవీన్‌ ఉల్‌ హాక్‌కు చోటు

Published on Wed, 09/13/2023 - 17:12

అక్టోబర్‌ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఇవాళ (సెప్టెంబర్‌ 13) ప్రకటించింది. ఈ జట్టుకు హస్మతుల్లా షాహీది నాయకత్వం వహించనుండగా.. రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, నూర్‌ అహ్మద్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్‌ కోసం ఆఫ్ఘన్‌ సెలెక్టర్లు ముగ్గురు రిజర్వ్‌ ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. గుల్బదిన్‌ నైబ్‌, షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, ఫరీద్‌ అహ్మద్‌ మలిక్‌లు వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ రిజర్వ్‌ ప్లేయర్లుగా ఉండనున్నారు. రెగ్యులర్‌ సభ్యుల్లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానంలో వీరు జట్టులో చేరతారు. 

రీఎంట్రీ ఇచ్చిన నవీన్‌ ఉల్‌ హాక్‌..
గత ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లితో గొడవ కారణంగా భారత క్రికెట్‌ అభిమానుల దృష్టిలో విలన్‌లా మారిపోయిన నవీన్‌ ఉల్‌ హాక్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ సెలెక్టర్లు వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌-2023 కోసం ప్రకటించిన జట్టుకు నవీన్‌ను ఎంపిక చేయకపోవడంతో, భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో కూడా అతనికి ఛాన్స్‌ ఉండదని అంతా అనుకున్నారు. అయితే, ఆఫ్ఘన్‌ సెలెక్టర్లు నవీన్‌కు భారత్‌లో ఆడిన అనుభవం ఉండటాన్ని పరిగణలోకి అతనికి జట్టులో చోటు ఇచ్చారు. కాగా, కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా నవీన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ సెలెక్టర్లు పక్కకు పెడతారని ప్రచారం​ జరిగిన విషయం తెలిసిందే.

వన్డే వరల్డ్‌కప్‌-2023 కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు: హస్మతుల్లా షాహీది (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్‌ (వికెట్‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్‌, రియాజ్‌ హసన్‌, రహ్మత్‌ షా, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, ఇక్రమ్‌ అలీఖిల్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, ఫజల్‌ హాక్‌ ఫారూఖీ

రిజర్వ్‌ ప్లేయర్లు.. గుల్బదిన్‌ నైబ్‌, షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, ఫరీద్‌ అహ్మద్‌ మలిక్‌

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)