నిప్పులు చెరిగిన ఒమర్‌జాయ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌

Published on Tue, 03/19/2024 - 14:51

షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్‌ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. 

మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్‌..
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో జద్రాన్‌ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్‌ ఇషాక్‌ (27), సెదీఖుల్లా అటల్‌ (19), ఇజాజ్‌ అహ్మద్‌ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్‌, జాషువ లిటిల్‌, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్‌ క్యాంపర్‌, డెలానీ, బెంజమిన్‌ వైట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన ఒమర్‌జాయ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌..
156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (4-0-9-4), నవీన్‌ ఉల్‌ హక్‌ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్‌ హక్‌ ఫారూకీ, రషీద్‌ ఖాన్‌, ఖరోటే తలో వికెట్‌ పడగొట్టారు. ఐర్లాండ్‌ బౌలర్లలో కర్టిస్‌ క్యాంపర్‌ (28) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. గెరాత్‌ డెలానీ (21), హ్యారీ టెక్టార్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ ఐర్లాండ్‌ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)