Breaking News

ఐదేసిన రషీద్ ఖాన్‌.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్‌

Published on Sun, 10/12/2025 - 07:39

బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ వైటావాష్‌కు అఫ్గానిస్తాన్ ప్ర‌తీకారం తీర్చుకుంది. శ‌నివారం అబుదాబి వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో బంగ్లాదేశ్‌ను  81 ప‌రుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే అఫ్గాన్‌ సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ జట్టు 44.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. స్టార్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌(140 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 95) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు నబీ(22), ఘజన్‌ఫర్‌(22) పర్వాలేదన్పించారు.

మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్‌ మెహది హసన్‌ మిరాజ్‌ మూడు వికెట్లతో సత్తాచాటగా.. టాంజిమ్‌ హసన్‌ షకీబ్‌, రిషాద్‌ హోస్సేన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

రషీద్‌ మయాజాలం..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ధాటికి విల్లవిల్లాడింది. బంగ్లాదేశ్‌ 28.3 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. 8.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన రషీద్‌.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

అతడితో ఒమర్జాయ్‌ మూడు, ఖరోటీ ఒక్క వికెట్‌ సాధించారు. బ్యాటింగ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన జద్రాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే అక్టోబర్‌ 14న అబుదాబి వేదికగా జరగనుంది.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)