Breaking News

గుర్భాజ్‌ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాను చిత్తు చేసిన అఫ్గాన్‌

Published on Tue, 11/12/2024 - 09:24

షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో అఫ్గానిస్తాన్‌ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.

బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(98) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ మెహాది హసన్‌ మిరాజ్‌(66) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 4 వికెట్లతో సత్తాచాటగా.. నబీ, రషీద్‌ ఖాన్‌​ తలా వికెట్‌ సాధించారు.

గుర్భాజ్‌ విధ్వంసకర సెంచరీ..
అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అఫ్గాన్‌ లక్ష్య చేధనలో ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్‌ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు 'మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌' అజ్మతుల్లా ఒమర్జాయ్‌(70 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో నహిద్‌ రాణా, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్‌ రిప్లై ఇవ్వాలి: పాక్‌ మాజీ కెప్టెన్‌

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)