రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన
Breaking News
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
Published on Mon, 01/27/2025 - 13:54
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ ఒమర్జాయ్ను ఈ అవార్డు వరించింది. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు.
ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక మినహా ఐర్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై విజయాలు సాధించింది. ఒమర్జాయ్ గతేడాది ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా, సెకెండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
24 ఏళ్ల ఒమర్జాయ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఒమర్జాయ్ 2024లో తన తొలి వన్డేలోనే సూపర్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయమైన 149 పరుగులు చేశాడు. ఒమర్జాయ్ గతేడాది సౌతాఫ్రికాపై ఓ అద్భుత ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోని రెండో వన్డేలో ఒమర్జాయ్ 50 బంతుల్లో అజేయమైన 86 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఒమర్జాయ్ బంతితోనూ చెలరేగాడు. 2021లో వన్డే అరంగ్రేటం చేసిన ఒమర్జాయ్ ఇప్పటివరకు 36 వన్డేలు ఆడి 907 పరుగులు చేశాడు. అలాగే 30 వికెట్లు పడగొట్టాడు. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీ పడ్డారు.
2024కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు
- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్
- ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్
- ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్
- ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝా
- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్
- ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్
- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్
- ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్
ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.
ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.
ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.
ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.
Tags : 1