Breaking News

ఇదేం బాదుడురా సామీ.. బిగ్‌బాష్‌ లీగ్‌లో చారిత్రక విజయం

Published on Fri, 01/06/2023 - 12:57

బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్‌లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్‌ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి.

మాథ్యూ షార్ట్‌ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్‌ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్‌ హోస్‌ (22 బంతుల్లో 38; ఫోర్‌, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్‌ బౌలర్లలో ప్యాట్రిక్‌ డూలే (2/25), టిమ్‌ డేవిడ్‌ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్‌ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన హోబర్ట్‌ హరికేన్స్‌.. బెన్‌ మెక్‌ డెర్మాట్‌ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్‌ జువెల్‌ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్‌ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

గ్రాండ్‌హోమ్‌ 2, కాన్వే, షార్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్‌.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్‌ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్‌ హరికేన్స్‌ పేరిట ఉండింది. 2016/17 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్‌ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)