Breaking News

ఐపీఎల్‌లో ఆడ‌క‌పోవ‌డం మంచిదైంది: ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌

Published on Mon, 06/10/2024 - 16:52

టీ20 వరల్డ్‌కప్‌-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న ఆసీస్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత‌మైన విజ‌యాలు సాధించింది. తొలుత ఒమన్‌ను చిత్తు చేసిన కంగారులు.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ ఇంగ్లండ్‌ను ఓడించారు. 

త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో జూన్ 12న న‌మీబియాతో ఆసీస్ తల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజ‌యం సాధిస్తే సూప‌ర్‌-8కు ఆర్హ‌త సాధిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్న‌ర్ ఆడమ్ జంపా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఐపీఎల్‌-2024లో ఆడ‌క‌పోవ‌డం త‌న‌కు క‌లిసొచ్చింద‌ని జంపా తెలిపాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆసీస్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ జంపా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అయితే ఐపీఎల్‌-2023లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన జంపా.. ఈ ఏడాది సీజ‌న్‌లో ఆడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. 

"ఐపీఎల్-2024లో ఆడ‌కూడ‌ద‌ని సీజ‌న్ ఆరంభానికే ముందే నిర్ణయించుకున్నాను. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైనదే అన్పించింది. ఎందుకంటే నిరంతర క్రికెట్‌తో నేను బాగా అలిసిపోయాను. 

ఈ లీగ్ ఆరంభ సమయానికి నేను కొంచెం​ మోకాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడి మళ్లీ గాయం తిరగబెడితే వరల్డ్‌కప్‌నకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగాను.

అదే విధంగా నాకు ఫ్యామిలీ కూడా. కొన్ని సార్లు పనికంటే ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యమని" క్రికెట్ ఆస్ట్రేలియాతో జంపా పేర్కొన్నాడు. కాగా ఈ ప్రస్తుత పొట్టిప్రపంచకప్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన జంపా 4 వికెట్లు పడగొట్టాడు.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు