Breaking News

ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టు.. రోహిత్‌ శర్మకు నో ప్లేస్‌

Published on Tue, 05/06/2025 - 19:06

ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్‌ దిగ్గజాలు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, షాన్‌ పొలాక్‌ తమ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో వారు ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారధిగా ఎం​ఎస్‌ ధోనిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు చోటు దక్కలేదు.

ఈ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్‌ గేల్‌, విరాట్‌ కోహ్లిని ఎంపిక చేశారు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో గిల్‌క్రిస్ట్‌ క్రిస్‌ గేల్‌ పేరు ప్రతిపాదించగా.. పొలాక్‌ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఏబీడి ఆధునిక టీ20 బ్యాటింగ్‌కు ఆధ్యుడని పొలాక్‌ ప్రశంసించాడు. మిగిలిన రెండు విదేశీ ఆటగాళ్ల బెర్త్‌ల కోసం గిల్‌క్రిస్ట్‌, పొలాక్‌ కలిసి లసిత్‌ మలింగ, సునీల్‌ నరైన్‌ పేర్లను ప్రతిపాదించారు. బౌలింగ్‌ ఎరీనాలో మలింగ 'గోట్‌' అని పొలాక్‌ కీర్తించాడు. స్పిన్‌ బౌలింగ్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌ కంటే సునీల్‌ నరైనే మోస్ట్‌ వ్యాల్యుయబుల్‌ ప్లేయర్‌ అని పొలాక్‌ అభిప్రాయపడ్డాడు.

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ కోసం గిల్‌క్రిస్ట్‌, పొలాక్‌ కలిసి సురేశ్‌ రైనాను ఎంపిక చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఏబీడిని ఎంచుకున్నారు. ఐదో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా ఆరో స్థానంలో ఎంఎస్‌ ధోని, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్‌ నరైన్‌ను ఎంపిక చేశారు. పేస్‌ బౌలర్లుగా మలింగ, బుమ్రా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా చహల్‌ను ఎంపిక చేశారు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ కలిసి ఎంపిక చేసిన ఐపీఎల్‌ ఆల్ టైమ్ XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌ కమ్‌ వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)