Breaking News

వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌ను భారీ ఎదురుదెబ్బ​

Published on Fri, 09/15/2023 - 15:51

వన్డే వరల్డ్‌కప్‌-2023కు ముందు పాకిస్తాన్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని తెలుస్తుంది. ఆసియా కప్‌-2023లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన నసీం ఆతర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. గాయం తీవ్రమైంది కావడంతో అతను తదుపరి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ బరిలోనూ దిగలేదు. పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నసీం.. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం​ నెల రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.

ఇదే జరిగితే అతను వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడు. మరోవైపు నసీం షాతో పాటు మరో పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ కూడా భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు. అయితే అతని గాయం అంత తీవ్రమైంది కాకపోవడంతో ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లను అందుబాటులో ఉంటాడు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు పాక్‌ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగానే అఘా సల్మాన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో గాయపడగా, శ్రీలంకతో మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ గాయపడ్డాడు.

కీలక ఆటగాళ్లంతా వరుసపెట్టి గాయాల బారిన పడటంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓటమిపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను (అక్టోబర్‌ 6) ఢీకొంటుంది. అనంతరం అక్టోబర్‌ 10న శ్రీలంకతో (హైదరాబాద్‌), అక్టోబర్‌ 14న భారత్‌తో తలపడుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)