Breaking News

క్రీడా గ్రామంలో కాదు... క్రూజ్‌ షిప్‌లో

Published on Sat, 05/03/2025 - 03:21

టోక్యో: కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల కోసం ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో క్రీడా గ్రామాన్ని నిర్మించడమేది ఆనవాయితీ. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ మెగా ఈవెంట్‌లోనూ ఇదే జరిగింది. కానీ వచ్చే ఏడాది జపాన్‌ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడల్లో మాత్రం క్రీడా గ్రామం కనిపించదు. దీని స్థానంలో ఫ్లోటింగ్‌ విలేజ్‌కు నిర్వాహకులు మొగ్గు చూపారు. అంటే నీటిపై తెలియాడే విలేజ్‌ అన్నమాట! ఇందుకోసం భారీ ఓడను వినయోగించనుంది. 

క్రూజ్‌ షిప్‌ తెలుసుగా... అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఓడ. నీటిపై కదలాడే నగరాన్ని తలపించే క్రూజ్‌షిప్‌లో ఏషియాడ్‌కు విచ్చేసే అథ్లెట్లకు బస కల్పించే ఏర్పాట్లను జపాన్‌ నిర్వాహకులు చేస్తున్నారు. వచ్చే ఏడాది సెపె్టంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరిగే ఈ ఆసియా క్రీడల్లో ఆసియా దేశాలకు చెందిన 15 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. వీరందరి బసకోసం రోటీన్‌గా క్రీడా గ్రామాన్ని నిర్మించకుండా క్రూజ్‌షిప్‌లోనే బస ఏర్పాట్లు చేయనున్నారు. 

ఇదే జరిగితే అథ్లెట్లకు ఇదో సరికొత్త అనుభూతిని అందిస్తుంది. జపాన్‌లోని అయిచి రాష్ట్రంలోని నగోయా నగరంలో ఆసియా క్రీడలతో పాటు పారా ఆసియా క్రీడలు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఆర్గనైజింగ్‌ కమిటీ నగోయా రేవు సమీపంలోని కింజో పీర్‌ వద్ద క్రూజ్‌షిప్‌ను ఫ్లోటింగ్‌ విలేజ్‌గా వాడుకోనుంది. 

ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌ 3్ఠ3, కనోయింగ్‌ –కయాకింగ్, సైక్లింగ్, మౌంటెన్‌ బైక్‌ సైక్లింగ్, రేసింగ్‌ ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, కురాష్, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్, రోయింగ్, రగ్బీ, సెపక్‌తక్రా, స్పోర్ట్‌ క్లైంబింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు తదితర పోటీల్లో పాల్గొనేందుకు 4600 మంది అథ్లెట్లు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ 20 క్రీడాంశాలకు సంబంధించిన వేదికలన్నీ (స్టేడియాలు) కూడా నగోయా పోర్ట్‌కు అతి దగ్గరలోనే ఉండటంతో నిర్వాహకులు ఫ్లోటింగ్‌ విలేజ్‌ (క్రూజ్‌షిప్‌పై) వైపు మొగ్గినట్లు తెలిసింది. 

ఇంతకు ముందెన్నడూ చూడని గ్రామాన్ని ఆవిష్కరించనున్నామని, ఇది అథ్లెట్ల జీవితాల్లో చిరకాలం నిలిచిపోయే వినూత్న వేదికని ఆసియా క్రీడల సాంకేతిక అధికారి ఒకరు తెలిపారు. భారీ ఓడలో కంటెయినర్లతో తయారు చేసిన విల్లాలు ఉంటాయి. అంతేకాదు జిమ్, స్విమ్మింగ్‌పూల్‌ సదుపాయలెన్నో ఉంటాయి.   

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)