Breaking News

యువ ఆటగాళ్ల ఆసియా సమరం

Published on Fri, 11/29/2024 - 04:28

దుబాయ్‌: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అండర్‌–19 ఆసియా కప్‌ 11వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో పోటీ పడుతున్నాయి. 

పాకిస్తాన్, యూఏఈ, జపాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్‌ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌ గ్రూప్‌ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్‌... శ్రీలంకతో నేపాల్‌ తలపడతాయి. 

దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్‌ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. డిసెంబర్‌ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్‌ ముగుస్తుంది. 

అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్‌–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్‌ స్టార్స్‌గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్‌ అమాన్‌ సారథ్యం వహిస్తుండగా... కిరణ్‌ చోర్మలే వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. 

టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్‌ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్‌ 2న జపాన్‌తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.  

భారత అండర్‌–19 జట్టు: మొహమ్మద్‌ అమాన్‌ (కెపె్టన్‌), కిరణ్‌ చోర్మలే (వైస్‌ కెపె్టన్‌), ఆయుశ్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్‌్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్‌ పంత్, హార్దిక్‌ రాజ్, నిఖిల్‌ కుమార్, హర్‌వంశ్‌ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్‌ నాగరాజ్, యుధాజిత్‌ గుహ, చేతన్‌ శర్మ.   

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)