Breaking News

హుబైదా–ప్రేమ్‌ జంటకు కాంస్యం

Published on Sun, 09/21/2025 - 09:59

బీజింగ్‌: పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోరీ్నలో భారత ప్లేయర్లు అబు హుబైదా–ప్రేమ్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించారు. డబ్ల్యూహెచ్‌1–డబ్ల్యూహెచ్‌2 కేటగిరీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ... సెమీఫైనల్లో చైనా ద్వయం చేతిలో ఓడింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో అబు హుబైదా–ప్రేమ్‌కుమార్‌ ఆలె జంట 4–21, 10–21తో మాయి జియాన్‌పెంగ్‌–క్యూ జిమో జోడీ చేతిలో పరాజయం పాలైంది. 

గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక పరాజయంతో భారత షట్లర్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ‘ప్రతి మ్యాచ్‌లో కొత్త సవాలే. వాటిని దాటితేనే ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఈ కాంస్యం భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించగలమనే నమ్మకాన్ని పెంచింది’ అని అబు హుబైదా పేర్కొన్నాడు. 

ఇటీవల థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన ఆఇసయా పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లోనూ ఈ జంట పతకం నెగ్గింది. చిన్నప్పుడు పోలియో మహమ్మారి బారినపడి కాళ్లు కోల్పోయిన 31 ఏళ్ల హుబైదా... వైకల్యాన్ని అధిగమిస్తూ నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో సైతం అతడు నిలకడగా పతకాలు సాధించాడు. ఉగాండా పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌íÙప్, ఈజిప్ట్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌లోనూ అతడు కాంస్య పతకాలు సాధించాడు. ఇక భారత సైన్యంలో సేవలందిస్తూ 2009లో స్పైనల్‌కార్డ్‌ గాయానికి గురైన ప్రేమ్‌ కుమార్‌ ఆలె 2014 నుంచి అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌ ఆడుతున్నాడు.     

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)