కేకేఆర్‌ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్‌ వీరుల జట్టు ఓటమి

Published on Wed, 11/27/2024 - 13:34

అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్‌ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్‌కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్‌ (ఆఫ్ఘనిస్తాన్‌).. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్‌.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లాడియేటర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్‌ వీరులు టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (22), రిలీ రొస్సో (10), నికోలస్‌ పూరన్‌ (8), జోస్‌ బట్లర్‌ (30), మార్కస్‌ స్టోయినిస్‌ (0), డేవిడ్‌ వీస్‌ (29), ఆజమ​్‌ ఖాన్‌ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 

నవాబ్స్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్‌ మిల్స్‌ 2, అఖిలేశ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్‌ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్‌ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్‌ 7, డేవిడ్‌ మలాన్‌ 6, ఓడియన్‌ స్మిత్‌ 8 పరుగులు చేశారు. 

గ్లాడియేటర్స్‌ బౌలర్లలో రిచర్డ్‌ గ్లీసన్‌, స్టోయినిస్‌, ఇబ్రార్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్‌కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో కేకేఆర్‌ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్‌ ధరకు తిరిగి  సొంతం చేసుకుంది.

 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)