Breaking News

Abu Dhabi T10 League: ఫైనల్లో సాంప్‌ ఆర్మీ

Published on Mon, 12/02/2024 - 20:41

అబుదాబీ టీ10 లీగ్‌లో మోరిస్‌విల్లే సాంప్‌ ఆర్మీ జట్టు ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్‌ 2) జరిగిన క్వాలిఫయర్‌-2లో సాంప్‌ ఆర్మీ.. ఢిల్లీ బుల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ బుల్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. 

టిమ్‌ డేవిడ్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. నిఖిల్‌ చౌదరీ (16), రోవ్‌మన్‌ పావెల్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇసురు ఉడాన 3, అమీర్‌ హమ్జా 2, ఇమాద్‌ వసీం, కరీం జనత్‌ తలో వికెట్‌ తీసి ఢిల్లీ బుల్స్‌ను కట్టడి చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్‌ ఆర్మీ మరో ఐదు బంతులు మిగిలుండగానే (ఐదు వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆండ్రియస్‌ గౌస్‌ (38), జాక్‌ టేలర్‌ (23 నాటౌట్‌) సాంప్‌ ఆర్మీ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. 

జాక్‌ టేలర్‌ తొమ్మిదో ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాది సాంప్‌ ఆర్మీని గెలిపించాడు. ఇవాళ రాత్రి 9 గంటలకు జరిగే ఫైనల్లో సాంప్‌ ఆర్మీ.. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)