Breaking News

జ్వ‌రంతో బాధ‌పడుతున్నా.. వారు స‌పోర్ట్‌గా నిలిచారు: అభిషేక్‌ శ‌ర్మ‌

Published on Sun, 04/13/2025 - 18:19

ఐపీఎల్‌-2025లో శ‌నివారం(ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీతో చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. తొలి ఐదు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన అభిషేక్‌.. పంజాబ్ కింగ్స్‌పై మాత్రం ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు.

ఉప్ప‌ల్ మైదానంలో అభిషేక్ త‌న బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం  40 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  కేవ‌లం 55 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న అభిషేక్‌.. 14 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 141 ప‌రుగులు చేశాడు.

అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించింది. అయితే అభిషేక్ శర్మ జ్వరంతో బాధపడుతూనే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంట. ఈ విషయాన్ని మ్యాచ్‌​ అనంతరం శర్మనే స్వయంగా వెల్లడించాడు. అదేవిధంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌, భారత టీ20 కెప్టెన్ సుర్యకుమార్ యాదవ్ తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారని అభిషేక్ తెలిపాడు.

"నేను నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడతున్నాను. ఈ సమయంలో యువరాజ్ సింగ్‌, సూర్యకుమార్ యాదవ్ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా ఆరోగ్యం గురుంచి తెలుసుకున్నారు. 

ఇటువంటి వ్యక్తులు నాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఏడాది సీజన్‌లో అంత మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయాను. నాపై నాకే కాస్త చిరాకు అన్పించింది. అప్పుడు కూడా నాకు వారు మద్దతుగా నిలిచారు. 

ఒక్క మంచి ఇన్నింగ్స్ వస్తే చాలు తిరిగి ఫామ్‌ను అందుకోవచ్చని ధైర్యం చెప్పారు. నేను కూడా అందుకోసం ఎదురు చూశాను. ఈ రోజు అది నేరవేరింది. ఎట్టకేలకు ఓ భారీ ఇన్నింగ్స్ ఆడగాలను" అని అభిషేక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)