Breaking News

అభిషేక్‌ సూపర్‌ సెంచరీ.. ఆంధ్ర స్కోరెంతంటే?

Published on Tue, 11/18/2025 - 09:36

టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో... జార్ఖండ్‌ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ప్రత్యర్ధికి దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.

 ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (156 బంతుల్లో 103 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో క్రీజులో ఉండగా... భారత జట్టు మాజీ సభ్యుడు కోన శ్రీకర్‌ భరత్‌ (67 బంతుల్లో 51; 8 ఫోర్లు), అండర్‌–19  ప్రపంచకప్‌ విజేత టీమిండియా సభ్యుడు షేక్‌ రషీద్‌ (117 బంతుల్లో 58; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. భరత్‌తో తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించిన అభిషేక్‌... రషీద్‌తో రెండో వికెట్‌కు 122 పరుగులు జత చేశాడు. 

అభిషిక్‌తో కలిసి నైట్‌వాచ్‌మన్‌ త్రిపురాణ విజయ్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఆంధ్ర మరో 104 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 259/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జార్ఖండ్‌ జట్టు 112.3 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్‌ 67 పరుగులిచ్చి 4 వికెట్లు... సౌరభ్‌ కుమార్‌ 77 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)