Breaking News

వారెవ్వా అభిషేక్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! వీడియో

Published on Sat, 06/15/2024 - 20:20

బెంగాల్‌ ప్రో టీ20-2024 సీజన్‌లో సంచలన క్యాచ్‌ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్‌ ఆటగాడు  అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. 

ఊహ‌కంద‌ని రీతిలో క్యాచ్ ప‌ట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్‌ 19వ వేసిన  ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్‌.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. 

దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కావడంతో అందరూ సిక్స్‌ అని భావించారు. కానీ లాంగాన్‌లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో ఫ్లయింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. 

దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయిపోయారు. అభిషేక్‌ కూడా క్యాచ్‌ పట్టిన వెంటనే టీమిండియా స్టార్‌ శిఖర్‌ ధావన్‌ స్టైల్లో సెలబ్రేషన్స్‌ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)