ఈసారి టైటిల్‌ విజేత ఆ జట్టే! కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే: డివిలియర్స్‌

Published on Thu, 04/06/2023 - 13:03

IPL 2023- AB de Villiers- Virat Kohli: సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2023 టైటిల్‌ను ఆర్సీబీ గెలవాలని తాను కోరుకుంటున్నానని.. అయితే ట్రోఫీ గెలిచే అవకాశాలు మాత్రం డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. 

కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌.. ఎంట్రీలోనే అదరగొట్టింది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఇక పదహారో ఎడిషన్‌లో సీఎస్‌కేతో ఆరంభ మ్యాచ్‌లో గెలుపొందిన హార్దిక్‌ సేన.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.

ఆర్సీబీ గెలవాలని ఉన్నా
తాజా సీజన్‌లోనూ వరుసగా రెండు విజయాలు నమోదు చేసి జోరు మీదుంది గుజరాత్‌. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీతో ముచ్చటించిన డివిలియర్స్‌.. ఈసారి చాంపియన్‌ ఎవరనుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందించాడు. ‘‘విజేతను అంచనా వేయడం కష్టమే. అయితే, ఐపీఎల్‌ వేలం సమయంలోనే గుజరాత్‌ టైటాన్స్‌ గురించి మాట్లాడుతూ.. ఆ జట్టుకు చాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాను.

ఇప్పుడు కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. అయితే, నా మనసులో మాత్రం ఆర్సీబీ ట్రోఫీ గెలవాలని ఉంది. గతేడాది బెంగళూరు అద్బుతంగా ఆడింది. ఈసారి కూడా అదే ఫామ్‌ కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు.

కోహ్లిలో పెద్దగా మార్పులేదు.. తన సక్సెస్‌ మంత్ర అదే
ఇక ఆర్సీబీ మాజీ సారథి విరాట్‌ కోహ్లిలో ఏమైనా మార్పులు గమనించారా అని ప్రశ్నించగా.. ‘‘కెప్టెన్సీ భారం నుంచి విముక్తి పొందాక తను చాలా రిలాక్సింగ్‌గా కనిపిస్తున్నాడు. నిజానికి తను అద్భుతమైన నాయకుడు. అంతర్జాతీయ స్థాయిలో.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్రవేశాడు. 

సారథ్య బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల కుటుంబం, స్నేహితులతో కలిసి కాస్త సమయం గడపడమే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తను మునుపటి కంటే మరింత సంతోషంగా ఉన్నాడు. తన సక్సెస్‌ మంత్ర ఇదే అనుకుంటా’’ అని డివిలియర్స్‌ పేర్కొన్నాడు.

తన ఆట తీరులో పెద్దగా మార్పులు రాలేదని.. అయితే ఇప్పుడు కాస్త రిఫ్రెష్‌ అయి అద్భుత ఫామ్‌తో మునుపటి కోహ్లిని తలపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ కోహ్లి 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 

చదవండి: కెప్టెన్‌గా చతేశ్వర్‌ పుజారా
బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్‌.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)