Breaking News

ఆర్సీబీ ఫైన‌ల్‌కు వెళ్తే భార‌త్‌కు వ‌స్తా: ఏబీ డివిలియర్స్‌

Published on Sat, 05/17/2025 - 21:35

ఐపీఎల్‌-2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రుస్తోంది. గ‌త రెండు మూడు సీజ‌న్‌ల‌తో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.

బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్‌, టిమ్ డేవిడ్‌, పాటిదార్ చెల‌రేగుతుంటే.. బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అద‌ర‌గొడుతున్నారు. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు జ‌ట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. 

ఈ ఏడాది సీజ‌న్‌లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, ఆర్సీబీ దిగ్గ‌జం ఏబీ డివిలియ‌ర్స్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఆర్సీబీ ఫైన‌ల్స్‌కు చేరుకుంటే త‌ను ఆ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు భార‌త్‌కు వ‌స్తాన‌ని డివిలియ‌ర్స్ వాగ్ధానం చేశాడు.

"ఆర్సీబీ ఫైన‌ల్‌కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో క‌చ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో క‌లిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవ‌డం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మ‌రొకటి ఉండ‌దు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది" అంటూ డివిలియ‌ర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

కాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌రపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియ‌ర్స్‌.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ జట్టులో చేరాడు. ఆ త‌ర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.
చదవండి: టీమిండియా త‌దుప‌రి టెస్టు కెప్టెన్ అత‌డే: సునీల్ గవాస్కర్

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)