Breaking News

డివిలియర్స్‌, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు

Published on Sun, 01/08/2023 - 16:25

టీ20ల్లో టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్‌.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఇక అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఈ టీ20 వరల్డ్‌ నెం1 బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, యూనివర్స్ బాస్ క్రిస్‌ గేల్‌ను సూర్యకుమార్‌ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు.

"ప్రపంచ క్రికెట్‌లో కొత్త యూనివర్స్‌ బాస్‌ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్‌ యాదవ్‌. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు.

సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్‌, క్రిస్ గేల్‌తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్‌ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్‌ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: సూర్యకుమార్‌ చేతికి ముద్దు పెట్టిన చాహల్‌.. వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)