Breaking News

'ఛాంపియన్స్‌​ ట్రోఫీ.. అతడికి భారత జట్టులో నో ఛాన్స్‌'

Published on Sat, 12/21/2024 - 17:16

విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ 2024-25 కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌కు చోటు ద‌క్క‌క‌పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీ కోసం కేర‌ళ క్రికెట్ ఆసోషియేష‌న్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందున అత‌డిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు. 

దీంతో అత‌డి స్ధానంలో త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను స‌ల్మాన్ న‌జీర్‌కు కేసీఎ అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో శాంస‌న్‌ను ఉద్దేశించి భార‌త మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ దేశవాళీ టోర్నీలో సంజూ భాగం కాకపోవడంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీకి కోసం వెళ్లే భారత జట్టులో ఛాన్స్‌ దక్కపోవచ్చు అని సంజూ అభిప్రాయపడ్డాడు.

"విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనే కేరళ జ‌ట్టులో సంజూ శాంస‌న్ పేరు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డిని ఎందుకు ఎంపిక చేయ‌లేదో నాకు ఆర్ధం కావ‌డం లేదు. వాయనాడ్‌లో నిర్వ‌హించిన ప్రాక్టీస్ క్యాంపులో సంజూ పాల్గోలేద‌ని, అందుకే కెసీఎ సెల‌క్ట‌ర్లు అత‌డిని ఎంపిక చేయ‌లేద‌ని కొంత మంది చెబుతున్నారు.

కాలి గాయం కార‌ణంగా శిక్షణా శిబిరానికి ఎంపిక కాలేన‌ని సంజూ కెసీఎకు ముందే తెలియ‌జేసిన‌ట్లు మ‌రి కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. కార‌ణం ఏదమైన‌ప్ప‌ట‌కి విజయ్ హజారే ట్రోఫీలో సంజూ భాగం కాలేక‌పోయాడు.

ఈ టోర్నీని సంజూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే టీ20ల్లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటిప్పుడు వన్డే క్రికెట్‌ను కూడా శాంసన్‌ దృ‍ష్టిలో పెట్టుకోవాలి. రిషబ్‌ పంత్‌ ఇంకా వన్డేల్లో పూర్తి స్ధాయిలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.

మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైన విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడాల్సింది. బహుశా శాంసన్‌ను ఛాంపియన్స్‌ కోసం భారత సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు" అనిచోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్‌కు గాయం!?

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)