Breaking News

'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ స‌డన్‌గా ఏమైందో మరి'

Published on Sat, 03/15/2025 - 17:38

ఐపీఎల్‌-2025కు సమయం అసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈ టైటిల్ వేట‌లో మొత్తం ప‌ది జ‌ట్లు మరోసారి త‌మ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్‌లో అందరి దృష్టి ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది.

గతేడాది సీజన్‌లో హార్దిక్ పాండ్యా  నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి మరి హార్దిక్‌కు ముంబై యాజమాన్యం తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అప్పటిలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. 

తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 18వ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

"కెప్టెన్‌గా తనను తను నిరూపించుకోవడానికి హార్దిక్ పాండ్యాకు ఇదొక అద్భుత అవ‌కాశం. ఒక‌ప్పుడు అత‌డు రోహిత్ శ‌ర్మ వారుసుడిగా కొన‌సాగాడు. రోహిత్ శ‌ర్మ గైర్హ‌జారీలో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా అత‌డు వ్య‌వ‌హ‌రించేవాడు. వైట్‌బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడ‌ని అంతా ఊహించారు.

కానీ స‌డన్‌గా కెప్టెన్సీ జాబితా నుంచి పాండ్యాను త‌ప్పించారు. హార్దిక్ గురించి ప్ర‌స్తుతం ఎవరూ చర్చించడం లేదు. అత‌డిని క‌నీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా అద్బుత‌మైన ఆట‌గాడు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌తీసారి త‌ను ముందుకు వ‌చ్చి అదుకునేవాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్‌కు కూడా చేర్చాడు.

ఈ సీజ‌న్‌లో హార్దిక్ కెప్టెన్‌గా త‌న త‌ను నిరూపించుకుంటే మ‌ళ్లీ అంద‌రి దృష్టిని ఆకర్షించే అవకాశముంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ముంబై ఇం‍డియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)