Breaking News

అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?: ధోని ఫైర్‌

Published on Sun, 05/04/2025 - 17:09

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు శనివారం మరో చేదు అనుభవం ఎదురైంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం రెండు పరుగుల తేడాతో ధోని సేన పరాజయం పాలై.. సీజన్‌లో తొమ్మిదో ఓటమిని నమోదు చేసింది.

చెన్నై బౌలర్ల చెత్త ప్రదర్శన వల్ల బ్యాటర్ల మెరుపులు కూడా వృథా అయిపోయాయి. ముఖ్యంగా పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు.

ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. 
కేవలం మూడు ఓవర్ల బౌలింగ్‌లోనే ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. ఐపీఎల్‌తో పాటు ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఖలీల్‌ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌గా పేరొందిన కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కూడా సహనం కోల్పోయాడు.

ఓవైపు ఆర్సీబీ బ్యాటర్లు తమ బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. మరోవైపు ఖలీల్‌ ఏకాగ్రత లేకుండా ఫీల్డింగ్‌ చేయడం తలా కోపానికి కారణమైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పదకొండో ఓవర్‌ను చెన్నై స్పిన్నర్‌ రవీంద్ర జడేజా వేయగా అప్పటికి విరాట్‌ కోహ్లి అర్ధ శతకానికి చేరువలో ఉన్నాడు.

అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?
అయితే, ఫీల్డ్‌ సెట్‌ చేస్తున్న వేళ ఖలీల్‌ మాత్రం శ్రద్ధ లేకుండా తన స్థానం నుంచి పక్కకు జరిగాడు. దీంతో సహనం కోల్పోయిన ధోని.. ‘‘ఖలీల్‌.. అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా అసలు?’’ అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించాడు. ఈ మాటలు స్టంప్‌ మైకులో రికార్డు అయ్యాయి.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..   చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.

రొమారియో షెఫర్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఓపెనర్లు జేకబ్‌ బెతెల్‌ (33 బంతుల్లో 55), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62) దంచికొట్టగా.. రొమారియో షెఫర్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌) ఆడాడు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ మూడు వికెట్లు తీయగా.. నూర్‌ అహ్మద్‌, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగుల వద్ద నిలిచిపోయింది. యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94) శతకం చేజార్చుకోగా.. జడేజా మెరుపులు (45 బంతుల్లో 77 నాటౌట్‌) కూడా వృథాగా పోయాయి. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్తానానికి దూసుకుపోగా.. చెన్నై ఆఖరిదైన పదో స్థానాన్ని మరోసారి అట్టిపెట్టుకుంది.

చదవండి: మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.. ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)