Breaking News

రెజ్లింగ్‌లో భారత్‌కు ఐదో ఒలింపిక్‌ బెర్త్‌... 68 కేజీల విభాగంలో ఫైనల్లోకి నిషా

Published on Sat, 05/11/2024 - 04:22

ఇస్తాంబుల్‌: ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ చరిత్రలో తొలిసారి మహిళల విభాగంలో భారత్‌ నుంచి అత్యధికంగా ఐదుగురు బరిలోకి దిగనున్నారు. వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియా ఫైనల్‌కు చేరుకొని భారత్‌కు ఐదో ఒలింపిక్‌ బెర్త్‌ను ఖరారు చేసింది. సెమీఫైనల్లో నిషా 8–4తో అలెగ్జాండ్రా ఎంగెల్‌ (రొమేనియా)పై గెలిచింది.

తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన నిషా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 3–0తో అలీనా షౌచుక్‌ (టరీ్క)పై, క్వార్టర్‌ ఫైనల్లో 7–4తో అడెలా హాంజ్లికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ మాన్సి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.

 నిషా కంటే ముందు అంతిమ్‌ పంఘాల్‌ (53 కేజీలు), వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు),  అన్షు మలిక్‌ (57 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు) పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. నేడు పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌ నుంచి ఆరుగురు రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)