Breaking News

జాతీయ ప్రాబబుల్స్‌కు 39 మంది ప్లేయర్లు

Published on Sun, 04/20/2025 - 01:36

న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ క్వాలిఫయర్స్‌ కు ముందు నిర్వహించనున్న జాతీయ శిబిరానికి 39 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. జూన్, జూలైలో జరగనున్న ఈ అర్హత పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా... జాతీయ మహిళల సీనియర్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌ క్రిస్పిన్‌ ఛెత్రీ శనివారం 39 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్‌ చోటు దక్కించుకుంది.

ఇటీవల ఇండియన్‌ ఉమెన్‌ లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) తరఫున 9 గోల్స్‌తో సత్తాచాటిన సౌమ్య...  ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 33 మ్యాచ్‌లాడింది. మహిళల ఆసియాకప్‌ 2026 క్వాలిఫయింగ్‌ టోర్నీకి థాయ్‌లాండ్‌ ఆతిథ్యమిస్తోంది. జూన్‌ 23 నుంచి జూలై 5 వరకు జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్‌ ‘బి’ నుంచి బరిలోకి దిగనుంది. 

ఆతిథ్య థాయ్‌లాండ్, మంగోలియా, టిమొర్‌ లెస్ట్, ఇరాక్‌తో భారత జట్టు తలపడుతుంది. దానికి ముందు భారత ప్లేయర్ల కోసం మే1 నుంచి బెంగళూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. సీనియర్‌ ప్లేయర్లు బాలా దేవి, ఆశాలత దేవికి ఈ ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. ఇటీవల ఐడబ్ల్యూఎల్‌లో రాణించిన యంగ్‌ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. 

ప్రాబబుల్స్‌: పాయల్, ఎలాంగ్‌బమ్‌ చాను, కైశమ్‌ మెలోడీ చాను, మోనాలిసా దేవి (గోల్‌ కీపర్స్‌), పూర్ణిమ కుమారి, నిర్మలా దేవి, మార్టినా థోక్‌చమ్, శుభాంగి సింగ్, సంజూ, మాలతీ, టోయిజమ్‌ చాను, రంజనా చాను, స్వీటి దేవి, విక్‌సిత్‌ బారా, షిల్కీ దేవి (డిఫెండర్స్‌), కిరణ్, రత్నబాలా దేవి, ముస్కాన్, బబీనా దేవి, కార్తీక అంగముత్తు, కోల్నీ, సంగీత, ప్రియదర్శిని, బేబే సనా, సంతోష్, అంజూ తమాంగ్‌ (మిడ్‌ఫీల్డర్స్‌), మౌసుమీ ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాజన, లిండా కామ్, రింపా హల్దార్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తమ్, సుమతి, మనీషా, గ్రేస్‌ డాంగ్‌మెయి (ఫార్వర్డ్స్‌).  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)