Breaking News

భజ్జీ చేసిన గాయం ఇప్పటికీ మానలేదు!

Published on Wed, 03/11/2026 - 16:29

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 2001లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ చిరస్మరణీయం. నిజానికి భారత టెస్టు క్రికెట్‌లో మరిచిపోలేని కీలక ఘట్టానికి ఆవిష్కరణ జరిగిన రోజు (మార్చి 11) ఇదే కావడం విశేషం. అప్పటికే సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. 

కోల్‌కతా వేదికగా ఆరంభమైన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరిచింది. తొలి రోజు ఆటను 236/3తో ఘనంగా ముగించిన ఆస్ట్రేలియా రెండో రోజు కూడా అదే జోరు కనబరిచింది. కానీ ఆస్ట్రేలియా ఆటలు 72వ ఓవర్‌ వరకు మాత్రమే సాగింది. 72వ ఓవర్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన హర్భజన్‌ సింగ్‌ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. వరుస బంతుల్లో పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, షేన్‌ వార్న్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

భజ్జీ హ్యాట్రిక్‌..
అప్పటికీ హర్భజన్‌ తన కెరీర్‌ మొదలుపెట్టి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది జరిగి 25 ఏళ్లవుతున్నా ఆ సంఘటనను మాత్రం గిల్‌క్రిస్ట్‌ ఇప్పటికీ మరిచిపోలేదనిపిస్తుంది. ‘ట్రూ కలర్స్‌’ పేరిట గిల్‌క్రిస్ట్‌ రాసిన పుస్తకంలో ఆనాటి అనుభవాలను పంచుకున్నాడు.

 ‘ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు దాదాపు 90వేల మంది ప్రేక్షకులు వచ్చారు. తొలిరోజు పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ మిచెల్‌ సాల్ట్‌, హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌ త్రయం పరుగులు రాబట్టారు. కానీ రెండోరోజు ఆటలో మాత్రం హర్భజన్‌ సింగ్‌ మాపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. పాంటింగ్, వార్న్‌లతో పాటు నా వికెట్‌ తీసి హ్యాట్రిక్‌ నమోదు చేసిన భజ్జీ (హర్భజన్‌) మొత్తంగా మా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.

అంపైర్ నిర్ణయంతో షాక్‌!
కానీ ఆరోజు నేను ఎల్బీగా ఔటైన విధానం ఇప్పటికీ నా మనసు నుంచి పోవడం లేదు. హర్భజన్‌ వేసిన తొలి బంతి లెగ్‌స్టంప్‌ వెలుపల తగిలి నావైపు టర్న్‌ అయింది. అయితే దానిని నేను ఆన్‌సైడ్‌లోకి తిప్పే ప్రయత్నం చేశాను. కానీ బంతి నా ప్యాడ్‌లకు తాకి పక్కకు వెళ్లింది. నేను ఔట్‌ కాలేదన్న ధీమాతో ఉన్నప్పటికీ, హర్భజన్‌ సహా మిగతా భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఎస్‌కె బన్సల్‌ ఔట్‌ ఇచ్చాడు. 

కానీ అంపైర్‌ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బంతి ప్యాడ్‌కు తాకడానికి ముందే బ్యాట్‌ను తాకింది. కానీ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో చేసేదేమీ లేక వెనుదిరిగాల్సి వచ్చింది. ఇప్పుడున్న డీఆర్‌ఎస్‌ టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో ఉండుంటే కచ్చితంగా నాటౌట్‌ అనే ఫలితం వచ్చి ఉండేది.’ అని రాసుకొచ్చాడు.

చారిత్రక విజయం..
కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 171 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేయడమే గాక సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ కూడా కైవసం చేసుకోవడం విశేషం. ఆనాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ వా సెంచరీతో చెలరేగగా.. హెడెన్‌, లాంగర్‌ అర్థసెంచరీలతో రాణించారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్‌ డబుల్ సెంచరీకి తోడు రాహుల్‌ ద్రవిడ్‌ సెంచరీతో రికార్డు స్థాయిలో 376 పరుగులు జోడించడంతో 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పని పట్టిన హర్భజన్‌  రెండో ఇన్నింగ్స్‌ లోనూ 6 వికెట్లతో దుమ్మురేపడంతో 212 పరుగులకే చాపచుట్టింది. దీంతో భారత్‌ చారిత్ర్మక విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు అటు లక్ష్మణ్‌.. ఇటు హర్భజన్‌లు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. 

చదవండి: ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహో

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)