Breaking News

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ షెడ్యూల్‌ ఖరారు

Published on Wed, 08/05/2026 - 19:33

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐసీసీ టోర్నీ తేదీలను ఖరారు చేసినప్పటికీ, వేదికను ఇంకా నిర్ణయించలేదు. మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫయర్‌లో పోటీ పడనున్నాయి.

ఈసారి క్వాలిఫికేషన్‌ విధానంలో కీలక మార్పులు ఉన్నాయి. 10 జట్లు క్వాలిఫయర్‌లో పాల్గొంటాయి. ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన జట్టు నేరుగా 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. 2, 3, 4 స్థానాల్లో నిలిచే జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ సిరీస్‌ దశకు వెళ్తాయి. సూపర్ సిరీస్‌లో విజేతకు ప్రపంచకప్‌ ప్రధాన దశలో మిగిలిన ఒక బెర్త్‌ దక్కుతుంది.

ఏ జట్లు క్వాలిఫయర్‌కు వస్తాయి..?
10 జట్లలో 2 జట్లు 2026 సెప్టెంబర్‌ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో దిగువన ఉండే ఫుల్‌ మెంబర్‌ జట్లు. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఇందుకు మినహాయింపు. 4 జట్లు క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌ 2లో టాప్‌-4 జట్లు. మిగతా 4 జట్లు వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ప్లేఆఫ్‌లో టాప్‌-4 జట్లు.

విండీస్‌ పరిస్థితి ఆసక్తికరం
ప్రస్తుతం వెస్టిండీస్‌ పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ఆ జట్టు సెప్టెంబర్‌ 30 కట్‌ఆఫ్‌కు ముందు భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. 

ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌-ఐర్లాండ్‌ సిరీస్‌ ఫలితాలు వారి ప్రపంచకప్‌ మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. 2027 ODI ప్రపంచకప్‌ అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)