Breaking News

2024 ప్రపంచ ఉత్తమ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌

Published on Sat, 01/11/2025 - 04:18

న్యూఢిల్లీ: భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా 2024 సంవత్సరానికిగానూ ప్రపంచ ఉత్తమ జావెలిన్‌ త్రోయర్‌గా ఎంపికయ్యాడు. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్‌ ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ న్యూస్‌’ ప్రకటించిన ర్యాంకింగ్స్‌ జాబితాలో... పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన 27 ఏళ్ల నీరజ్‌ చోప్రా అగ్రస్థానం దక్కించుకున్నాడు. ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ న్యూస్‌’ మేగజైన్‌కు 78 ఏళ్ల చరిత్ర ఉంది.  

2024లో డైమండ్‌ లీగ్‌లో ఒక్క విజయం కూడా సాధించని నీరజ్‌... దోహా, లుసానే, బ్రస్సెల్స్‌ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్‌ టైటిల్‌ సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)తో పోటీపడి నీరజ్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్‌... గత ఏడాది డైమండ్‌ లీగ్‌ మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. 2023లోనూ నీరజ్‌ ఈ జాబితాలో ‘టాప్‌’ ప్లేస్‌లో నిలిచాడు. ‘అగ్రస్థానం కోసం నీరజ్‌ చోప్రా, పీటర్స్‌ మధ్య గట్టి పోటీ సాగింది.

గత ఏడాది నీరజ్‌ డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ నెగ్గకపోయినా 3–2తో పీటర్స్‌పై ఆధిక్యంలో నిలిచాడు. ఒలింపిక్‌ చాంపియన్, పాకిస్తాన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ ఐదో స్థానం దక్కించుకున్నాడు’ అని మేగజైన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)