Breaking News

ఇద్దరు అంతే వెలగబెట్టారు.. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై ఎందుకో..?

Published on Sat, 06/24/2023 - 16:52

వెస్టిండీస్‌ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్ట్‌ జట్టులో నయా వాల్‌ పుజారా పేరు గల్లంతు కావడంపై అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారితో కొందరు టీమిండియా మాజీలు, విశ్లేషకులు గొంతు కలుపుతున్నారు. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై మాత్రం ఎందుకోనని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఒకేలా చెత్త ప్రదర్శనలు చేసినప్పడు కోహ్లిపై సెలెక్టర్లకు ప్రత్యేక ప్రేమ ఎందుకోనని నిలదీస్తున్నారు.

ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా రుజువు చేస్తూ సెలెక్టర్ల తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 2020 నుంచి పుజారా 28 టెస్ట్‌లు ఆడి 29.69 సగటున పరుగులు చేస్తే, కోహ్లి సైతం అదే యావరేజ్‌తో (25 మ్యాచ్‌ల్లో) పరుగులు చేశాడని, ఇద్దరూ ఒకేలా వెలగబెట్టినప్పుడు కోహ్లిపై మాత్రమే ప్రత్యేకమైన ఇంటరెస్ట్‌ చూపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.

పుజారాతో పాటు కోహ్లిని కూడా తప్పిస్తే అతనికీ తెలుసొచ్చేది, అలాగే మిడిలార్డర్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లూ ఉండేదని అంటున్నారు. పుజారా, కోహ్లిలను పక్కకు పెడితే 2020 నుంచి టెస్ట్‌ల్లో గిల్‌ (16 మ్యాచ్‌ల్లో 32.89 సగటు), రహానే (20 మ్యాచ్‌ల్లో 26.50)లు కూడా అడపాదడపా ప్రదర్శనలే చేశారని, వీరితో పోలిస్తే రోహిత్‌ శర్మ (18 మ్యాచ్‌ల్లో 43.2) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడని గణాంకాలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. 

అందరూ ఓపెనర్లే.. మిడిలార్డర్‌లో ఎవరు..?
వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్‌ జట్టుపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్‌ డౌన్‌ ఆటగాడు పుజారాను పక్కకు పెట్టారు సరే.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్‌ జట్టుకు కొత్తగా ఎంపికైన యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు ఓపెనర్‌ బ్యాటర్లేనని, అలాంటప్పుడు పుజారా స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరని నిలదీస్తున్నారు. జట్టులో ఆల్‌రెడీ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు ఓపెనర్లుగా ఉన్నప్పుడు కొత్తగా మిడిలార్డర్‌ బ్యాటర్‌ను తీసుకుని ఉంటే జట్టు సమతూకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదు..?
ఓ మిడిలార్డర్‌ బ్యాటర్‌పై (పుజారా) వేటు వేసినప్పుడు అతని స్థానాన్ని మరో మిడిలార్డర్‌ ఆటగాడితోనే భర్తీ చేయాలన్న లాజిక్‌ను సెలెక్టర్లు ఎలా మిస్‌ అయ్యారని భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో అందరూ ఓపెనర్లనే ఎంపిక చేయకపోతే, దేశవాలీ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ లాంటి ఆటగాడిని తీసుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. 

విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కెఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)