Breaking News

ఐపీఎల్‌ 2025లో ఉసూరుమనిపించినా, ఎం​ఎల్‌సీలో ఇరగదీస్తున్న సూపర్‌ కింగ్స్‌

Published on Mon, 06/16/2025 - 12:07

ఐపీఎల్‌ 2025లో ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు సిస్టర్‌ ఫ్రాంచైజీ టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025లో అంచనాలకు మించి రాణిస్తూ సత్తా చాటుతుంది. టీఎస్‌కే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

లాస్‌ ఏంజలెస్‌ నైట్‌ రైడర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీఎస్‌కే 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్‌ తరుపుముక్క నూర్‌ అహ్మద్‌ (4-0-25-4) చెలరేగిపోయాడు. ఫలితంగా సూపర్‌ కింగ్స్‌ ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా విజయవంతంగా కాపాడుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌కింగ్స్‌.. డెవాన్‌ కాన్వే (22 బంతుల్లో 34; ఫోర్లు, సిక్స్‌), సాయితేజ ముక్కామల్ల  (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డారిల్‌ మిచెల్‌  (33 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), షుభమ్‌ రంజనే  (19 బంతుల్లో 24; ఫోర్, సిక్స్‌), డొనొవన్ ఫెరియెరా (16 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (10 బంతుల్లో 8; సిక్స్‌) ఒక్కడే విఫలమయ్యాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో తన్వీర్‌ సంఘా 2, రసెల్‌, వాన్‌ ష్కాల్క్‌విక్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం​ కష్ట సాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌.. నూర్‌ అహ్మద్‌ మాయాజాలం ధాటికి 17.1 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. నూర్‌తో పాటు ఆడమ్‌ మిల్నే (3.1-0-8-2), స్టీఫెన్‌ విగ్‌ (3-0-25-2), డారిల్‌ మిచెల్‌ (3-0-20-1), జియా ఉల్‌ హక్‌ (3-0-28-1) కూడా రాణించారు. 

అరివీర భయంకరమైన బ్యాటర్లతో నిండిన నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ సూపర్‌ కింగ్స్‌ బౌలర్ల ధాటికి వణికిపోయింది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో  వాన్‌ ష్కాల్క్‌విక్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అలెక్స్‌ హేల్స్‌ (25), ఉన్ముక్త్‌ చంద్‌ (22), మాథ్యూ ట్రంప్‌ (23), అలీ ఖాన్‌ (16 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్‌ 2, నితీశ్‌ కుమార్‌ 1, సైఫ్‌ బదార్‌ 0, ఆండ్రీ రసెల్‌ 1, సునీల్‌ నరైన్‌ 0 పరుగులకు ఔటయ్యారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)