Breaking News

53 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి!

Published on Sat, 09/21/2024 - 15:17

అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. యాభై మూడేళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇంత వరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఐదు వికెట్లతో చెలరేగి రేర్‌ ఫీట్‌ నమోదు చేశాడు. ఇంతకీ అదేంటంటారా?!..

అఫ్గనిస్తాన్‌- సౌతాఫ్రికా మధ్య యూఏఈ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. వన్డేల్లో ప్రొటిస్‌పై మొదటి విజయం అందుకున్న హష్మతుల్లా బృందం.. రెండో వన్డేలో సంచలన విజయం సాధించింది. బవుమా సేనను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

షార్జా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై నెగ్గి.. అఫ్గన్‌ సిరీస్‌ గెలవడంలో 26  ఏళ్ల రషీద్‌ ఖాన్‌ది కీలక పాత్ర. ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు బౌల్‌ చేసిన ఈ స్పిన్‌ మాంత్రికుడు కేవలం 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. సౌతాఫ్రికా ఓపెనర్‌ టోనీ డి జోర్జి(17), ఐడెన్‌ మార్క్రమ్‌(21), ట్రిస్టన్‌ స్టబ్స్‌(5), కైలీ వెరెన్నె(2), వియాన్‌ మల్డర్‌(2) రషీద్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్‌ చేరారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం(సెప్టెంబరు 20) రషీద్‌ ఖాన్‌ పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలో వన్డే చరిత్రలో పుట్టినరోజున ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఈ అఫ్గన్‌ స్టార్‌ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు తమ బర్త్‌డే నాడు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ వెర్నర్‌ ఫిలాండర్‌ 2007లో ఐర్లాండ్‌ మీద 4/12, ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 2010లో ఆస్ట్రేలియా మీద 4/44 గణాంకాలు నమోదు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)