ఇంగ్లండ్‌ గడ్డపై చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్‌

Published on Sat, 08/01/2026 - 12:26

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్ ఆశుతోష్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. అక్కడి వన్డే కప్‌లో హ్యాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ, 4 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో భారీ హిట్టర్‌గా పేరున్న అశుతోష్‌, ఇంగ్లండ్‌లోని వైవిధ్యభరితమైన పిచ్‌లపై తన మీడియం పేస్‌ బౌలింగ్‌లో చెలరేగడం గమనార్హం.

తాజాగా అతడు ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. దీనికి ముందు మ్యాచ్‌లో ఓ వికెట్‌ తీసిన అశుతోష్‌ అంతకుముందు మ్యాచ్‌లో 4 వికెట్లు, దానికి ముందు మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనలతో అశుతోష్‌ ఈ సీజన్‌లో హ్యాంప్‌షైర్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

అయితే ఈ టోర్నీలో అశుతోష్‌ బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 37 పరుగులే చేశాడు. భారీ హిట్టింగ్‌ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఒకటి రెండు మెరుపులతో సరిపెట్టాడు. ఈ టోర్నీలో అశుతోష్‌ స్కోర్లు వరుసగా 10, 0, 11, 16 పరుగులుగా ఉన్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అశుతోష్‌ బౌలింగ్‌లో ఇరగదీయడంతో ఎసెక్స్‌పై హ్యాంప్‌షైర్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. నోవా థైన్ శతకం (109)తో మెరిశాడు.

318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షైర్ 47.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిక్ గుబిన్స్ (53), టామ్ ప్రెస్ట్ (51), జేమ్స్ ఫుల్లర్ (నాటౌట్ 58) అర్ధశతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు. 

కాగా, ఇంగ్లండ్‌ వన్డే కప్‌లో అశుతోష్‌తో పాటు మరో భారత బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా సత్తా చాటుతున్నాడు. కుల్దీప్‌ సైతం ఆడిన ప్రతి మ్యాచ్‌లో కనీసం 2 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి, తన జట్టు (యార్క్‌షైర్‌) విజయాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. 
 

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)