Breaking News

ఆసీస్‌తో నాలుగో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన అశ్విన్‌

Published on Wed, 03/08/2023 - 22:50

భారత్, ఆస్ట్రేలియా మధ్య  అహ్మదాబాద్‌ వేదికగా గురువారం(మార్చి 9 నుంచి) నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలని టీమిండియా కన్నేసింది.

ఇదే సమయంలో నాలుగో టెస్టులో అందరి చూపు టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పైనే ఉన్నాయి. అందుకు ఒక కారణం ఉంది. భారత స్టార్ బౌలర్ అశ్విన్ నాలుగో టెస్టులో భారత లెజెండరీ బౌలర్‌ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకావం ఉంది.  ఆసీస్‌తో నాలుగో టెస్టులో  అశ్విన్‌ ఐదు వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రికార్డు కుంబ్లే పేరిట ఉంది.

ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 111 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 107 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. ఇది కాకుండా స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో కుంబ్లే, అశ్విన్ ఇద్దరూ తలో 25 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు.

దీనితో పాటు మరో రికార్డు కూడా ఎదురుచూస్తోంది. మ్యాచ్‌లో అశ్విన్‌ 10 వికెట్లు తీస్తే అన్ని ఫార్మాట్లు కలిపి 700 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. ఇప్పటివరకు కుంబ్లే(956 వికెట్లు), హర్భజన్‌(707 వికెట్లు) మాత్రమే ఉన్నారు.

 ఇక నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)