Breaking News

రెండో టెస్టులో పాకిస్తాన్‌ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్‌

Published on Tue, 01/07/2025 - 07:33

దక్షిణాఫ్రికా(South Afrcia) గడ్డపై వన్డే సిరీస్‌ ‘క్లీన్‌స్వీప్‌’ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు... టెస్టు సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప‌ర్యాట‌క పాకిస్తాన్  ‘వైట్‌వాష్‌’కు గురైంది. కేప్‌టౌన్ వేదిక‌గా సోమ‌వారం(జ‌న‌వ‌రి 6) ముగిసిన రెండో టెస్టులో పాక్‌పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.

ఫాలో ఆన్‌లో అదుర్స్‌..
కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశ‌ప‌రిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్‌లో మాత్రం అద్భుత‌మైన పోరాటం ప‌ట‌మక‌న‌బ‌రిచింది.  ఓవర్‌నైట్‌ స్కోరు 213/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖ‌రికి  122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. దీంతో స‌ఫారీల ముందు పాకిస్తాన్ కేవ‌లం  58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచ‌గ‌ల్గింది.

పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (251 బంతుల్లో 145; 17 ఫోర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా... ఆఘా సల్మాన్‌ (95 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (75 బంతుల్లో 41; 2 ఫోర్లు), ఆమేర్‌ జమాల్‌ (34; 7 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

ఊదిప‌డేసిన సౌతాఫ్రికా..
ఇక 58 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్‌ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఊదిప‌డేసింది. డేవిడ్‌ బెడింగ్‌హమ్‌ (30 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (14 నాటౌట్‌) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.

ద‌క్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు చేయగా... పాకిస్తాన్ మాత్రం త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ క్ర‌మంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వ‌చ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో  డ‌బుల్ సెంచ‌రీతో చెలరేగిన రికెల్టన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 11 నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.
చదవండి: Jasprit Bumrah: భయం పుట్టించాడు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)