స్టేటస్‌పెట్టుకుంటే డబ్బులిస్తాం!

Published on Mon, 06/02/2025 - 01:44

సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్‌ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్‌ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్‌ వాడటం అన్ని ప్రాంతాల్లో పరిపాటిగా మారడంతో దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తాము పంపిన ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుంటే మీ బ్యాంకు ఖాతాల్లో కాసులు వచ్చిపడతాయని బురిడీ కొట్టిస్తున్నారు.

వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టిన ఫొటోలను వ్యూ, లైక్, కామెంట్‌.. ఇలా ఒక్కో టాస్క్కు రూ. 2 చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా రిజి్రస్టేషన్‌ ఫీజు కింద రూ. 300 తాము చెప్పిన ఫోన్‌ నంబర్‌కు పంపాలని సూచిస్తున్నారు. వాటిని నమ్మి వాట్సాప్‌ స్టేటస్‌ టాస్క్ ముందుకొచ్చే వారి నుంచి ముందుగా రూ. 300 వసూలు చేయడమే కాకుండా మరో ఆరుగురిని చేరిస్తే కట్టిన రూ. 300 తిరిగి ఇస్తామని ఊదరగొడుతున్నారు. క్రమంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ తరహాలో చైన్‌ను ఏర్పాటు చేస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాండూరు ప్రాంతంలో ఈ తరహా సైబర్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. మారింది. వేలాది మంది ఈ తరహాలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. - సాక్షి, హైదరాబాద్‌

బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో..
సైబర్‌ మోసగాళ్లు చెప్పే మాటలు నమ్మి బాధితులంతా రూ.300 చొప్పున వారు చెప్పే గూగుల్‌ పే, ఫోన్‌ పే నంబర్లకు చెల్లిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరికి రూ. 300 తిరిగి ఇస్తున్న నేరగాళ్లు... ఎక్కువ మంది నుంచి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌ను నెలపాటు పెట్టుకోవడంతోపాటు ప్రతిరోజూ స్కీన్ర్‌ షాట్‌ పంపాలని నిబంధన విధించడం.. చివరకు నిబంధనలు పాటించనందున మళ్లీ మొదటి నుంచి చేయాలంటూ అమాయకులను మోసగిస్తున్నారు. ఈ తరహా మోసాలు ప్రధానంగా తాండూరు, వికారాబాద్‌ ప్రాంతంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితులంతా ఇంత చిన్నమొత్తానికి పోలీసులకు ఏం ఫిర్యాదు చేస్తాంలేనని వదిలేస్తుండటం సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారుతోంది. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్ము రూ. లక్షల్లోకి చేరుతోంది.

తెలిసిన వాళ్లు చెబితే డబ్బు కట్టాం 
మాకు తెలిసిన వ్యక్తి ద్వారా వాట్సాప్‌ స్టేటస్‌ పెడితే డబ్బులు వస్తాయని తెలిసి మేం కూడా రూ. 300 ఫీజు ఆన్‌లైన్‌లో కట్టి రుద్ర టెక్నాలజీ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాం. ఆ తర్వాత 30 ఫొటోలు వచ్చాయి. రోజుకు ఒకటి చొప్పున వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత డబ్బులు తిరిగి రాలేదు. – సుదర్శన్‌రెడ్డి, తాండూరు

ఐదుగురిని చేర్పించి మోసపోయా
వికారాబాద్‌లో ఓ స్నేహితుడి ద్వారా రూ. 300 ఆన్‌లైన్‌లో పంపా. 30 రోజులపాటు ఫొటోలు పెట్టాక డబ్బులు అడిగితే టాస్క్‌ సరిగా చేయలేదన్నారు. గ్రూప్‌లో ఐదుగురిని చేరి్పస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఆశపెట్టడంతో ఐదుగురిని చేరి్పంచా. అయినా నాతోపాటు ఆ ఐదుగురి డబ్బులు కూడా పోయాయి. 
– నీరటి నరేశ్‌కుమార్, కొత్తూరు 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)