Breaking News

లక్ష కోట్లు ఒక్కరోజే చెల్లించారు

Published on Fri, 04/04/2025 - 06:21

సాక్షి, స్పెషల్‌ డెస్క్: స్మార్ట్‌ఫోన్ల వాడకంలో, డేటా వినియోగంలోనే కాదు.. డిజిటల్‌ చెల్లింపుల్లోనూ మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల్లో తాజాగా సరికొత్త రికార్డు ‘టచ్‌’ చేశారు. ఒక్కరోజే లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిపారు.

2025 మార్చి 1న దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా రూ.1,01,627.92 కోట్ల విలువైన లావాదేవీలు నమోదు చేసి వాడకం మామూలుగా లేదనిపించారు. తొమ్మిదేళ్ల యూపీఐ చరిత్రలో ఈ స్థాయి లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఇక సంఖ్య పరంగా ఈ ఏడాది అత్యధికంగా మార్చి 13న గత రికార్డుకు చేరువగా 64.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2024 అక్టోబర్‌ 31న అత్యధికంగా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి.  

కొనసాగుతున్న రికార్డులు..
యూపీఐ లావాదేవీల విలువ, సంఖ్య విషయంలో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా 2025 మార్చిలో రూ.24,77,221.59 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. లావాదేవీల సంఖ్య గత నెలలో 1,830 కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఒక నెలలో ఇప్పటివరకు ఇవే అత్యధికం. సగటున రోజుకు లావాదేవీల విలువ రూ.79,910 కోట్లకు, లావాదేవీల సంఖ్య 59 కోట్లను తాకింది. 

ఇక దేశంలో 661 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ యాప్స్‌ యూపీఐ సేవలను అందిస్తున్నాయి. మార్చి నెల విలువలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 73 శాతం, వ్యక్తుల నుంచి వర్తకులకు 27 శాతం లావాదేవీలు జరిగాయి. అలాగే సంఖ్యలో వ్యక్తుల నుంచి వర్తకులకు 63 శాతం, వ్యక్తుల మధ్య 37 శాతం నమోదయ్యాయి. 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)