Breaking News

గోల్డ్‌లోన్స్‌లో దక్షిణాది రాష్ట్రాలే టాప్‌

Published on Wed, 12/03/2025 - 01:49

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: రుణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావడం, తక్కువ పత్రాలు, సౌకర్యవంతమైన నిబంధనలు.. అందుకే జనం గోల్డ్‌లోన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఇటీవలి కాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. దీంతో తాకట్టు పెట్టిన పసిడిపై అందుకునే రుణ మొత్తమూ అధికమైంది. అయితే ఆసక్తికర విషయం ఏటంటే భారత్‌లో దక్షిణాది వాసులే అత్యధికంగా బంగారంపై లోన్లు తీసుకుంటున్నారు. 

ఖరీదైన రుణాలవైపు.. 
సగటున ఒక్కో వినియోగదారుడు అందుకున్న రుణ మొత్తం 2023 సెప్టెంబర్‌లో రూ.1.1 లక్షలు ఉంటే.. రెండేళ్లలో రూ.1.64 లక్షలకు చేరింది. రూ.లక్ష లోపు విలువ చేసే రుణ ఖాతాల సంఖ్య తగ్గింది. రూ.లక్షకుపైగా విలువ చేసే రుణ ఖాతాలు దూసుకెళ్లాయి. మొత్తం రుణాల్లో విలువ పరంగా.. రూ.లక్ష లోపు విలువచేసే రుణాల వాటా రెండేళ్లలో 25.9% నుంచి 14.4% పడిపోయింది. అలాగే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా దాదాపు రెండింతలైంది. పసిడి విలువ పెరగడమూ ఈ జోరుకు కారణమైంది. దేశవ్యాప్తంగా మొత్తం రిటైల్‌ రుణాల్లో గోల్డ్‌లోన్స్‌ అత్యధికంగా 27 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.

దేశంలో మొత్తం బంగారు రుణాలు సెపె్టంబర్‌ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 76.55% ఉంది. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు తొలి స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. మొత్తం గోల్డ్‌ లోన్స్‌లో టాప్‌–10 రాష్ట్రాలు రూ.13.2 లక్షల కోట్లు కైవసం చేసుకోగా, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్ర మే. అయితే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ మధ్య 3.69 కోట్ల మంది కస్టమర్లు రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పసిడి రుణాలు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే రుణ మొత్తం 53%, వినియోగదారుల సంఖ్య 16% పెరగడం విశేషం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)