Breaking News

విమానంలో విద్యుత్‌

Published on Fri, 06/13/2025 - 05:52

నడవడమే రాని మానవుడు నేడు పక్షిలా గాలిలో ఎగిరిపోయే సాధనాలను కనుగొని ఎక్కడికి అంటే అక్కడికి నిమిషాలు, గంటల్లోనే ప్రయాణిస్తున్నాడు. దేశ విదేశాల్లో విమానంలో చక్కర్లు కొడుతున్నాడు. ఆ విమానం నడవాలంటే మాత్రం ఇంధనంతో పాటు విద్యుత్‌ కూడా చాలా అవసరం. కానీ, అవే ఒక్కోసారి వందల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా అలాంటిదే.

ఈ దుర్ఘటనకు విమానంలో విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం కారణం కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విమానంలో విద్యుత్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? ఎందుకు విఫలం అవుతుంది..? దానివల్ల జరిగిన ప్రమాదాలేంటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి, అమరావతి: విమానంలో ప్రధానంగా నాలుగు రకాల విద్యుత్‌ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వాటినే ప్రధాన, అత్యవసర, ద్వితీయ, సహాయక విద్యుత్‌ వ్యవస్థలుగా పిలుస్తుంటారు. వీటితో పాటు ఓవర్‌లోడ్, షార్ట్‌ సర్క్యూట్‌ వంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షించేందుకు సర్క్యూట్‌ బ్రేకర్లను అమర్చుతారు. అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. నావిగేషన్, కమ్యూనికేషన్, నియంత్రణ, క్యాబిన్, కాక్‌పిట్‌ లైటింగ్, ఎయిర్‌ కండిషనింగ్, టీవీ, ఫ్యాన్లు వంటి కీలక పనులకు ఈ విద్యుత్‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

ఇది ఏమాత్రం విఫలమైనా విమానం కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విమానంలో జనరేటర్లు లేదా ఆల్టర్నేటర్లు అనేవి ఉంటాయి. ఇవి ఇంజిన్‌తో నడుస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన ఇంజన్లు పని చేయనప్పుడు సహాయక విద్యుత్‌ యూనిట్‌ ఆదుకుంటుంది. రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ అనేది కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ వనరుగా పనికొస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ రెక్టిఫయర్‌ యూనిట్లు కొన్ని వ్యవస్థల కోసం విద్యుత్‌ను అందిస్తుంటాయి. బ్యాటరీలు బ్యాకప్‌ పవర్‌ సోర్స్‌లుగా పనిచేస్తాయి. కాకపోతే ఈ వ్యవస్థ అన్ని విమానాల్లోనూ ఒకేలా ఉండదు. సింగిల్‌ ఇంజిన్‌ జనరల్‌ ఏవియేషన్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఆధునిక, బహుళ ఇంజిన్‌ కమర్షియల్‌ జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్య విద్యుత్‌ వ్యవస్థ సామర్థ్యం, నిర్మాణంలో చాలా తేడా ఉంటుంది.  

ముందే శిక్షణ ఇస్తారు.. 
విద్యుత్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా తగిన సూచనలను, శిక్షణను ముందే పైలట్‌లకు తెలియజేస్తారు. విద్యుత్‌ వ్యవస్థ వైఫల్యాన్ని సూచించడానికి ఒక అమ్మీటర్, లోడ్‌ మీటర్‌ లేదా హెచ్చరిక లైట్‌ ఉంటాయి. బలమైన రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, వైఫల్య హెచ్చరిక నిబంధనలు విద్యుత్‌ వ్యవస్థలో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు తగిన సూచనలను పైలట్‌లకు అందజేస్తుంటాయి. 

స్టాండ్‌బై ఫ్లైట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎమర్జెన్సీ ఫ్లోర్‌ పాత్‌ ఇల్యూమినేషన్‌ వంటి భాగాలు వాటికి సొంత బ్యాకప్‌ విద్యుత్‌ ఉంటుంది. విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా విఫలమైనా కూడా ఇవి పనిచేస్తాయి. విమానంలో సర్క్యూట్‌ బ్రేకర్‌ విఫలమైనప్పుడు ఒకసారి మాత్రమే రీసెట్‌ చేయాలి. రెండోసారి చేయకూడదు. విద్యుత్‌ జనరేటర్లు, వైర్ల నుంచి పొగలు, మంటలు వస్తే విద్యుత్‌ ఐసోలేషన్‌ విధానాన్ని అనుసరించాలి. విమానాన్ని త్వరగా ల్యాండ్‌ చేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా భారీ నష్టం సంభవిస్తుంది.

విద్యుత్‌ వ్యవస్థ విఫలంతో విమాన ప్రమాదాలు, దుర్ఘటనల్లో కొన్ని
⇒ ఎండీ11 అనే స్విస్‌ ఎయిర్‌ విమానంలో విద్యుత్‌ అగ్నిప్రమాదం వల్ల కెనడా సమీపంలో 1998 సెపె్టంబర్‌ 2న అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది.  
⇒ 2010 ఆగస్టు 24న ఉత్తర సూడాన్‌లో ఖార్టూమ్‌ నుంచి బీరుట్‌ బయల్దేరిన ఏ321 ఎయిర్‌బస్‌లో జనరేటర్లు దెబ్బతిని విద్యుత్‌ వ్యవస్థ పనిచేయడం మానేసింది. 49 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

⇒ 2009 మార్చి 15న లండన్‌ హీత్రూ నుంచి ఎడిన్‌బర్గ్‌కు బయల్దేరిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఏ319  విమానంలో విద్యుత్‌ వైఫల్యం ఏర్పడి పైలట్లకు డిస్‌ప్లే కనిపించలేదు. పొగలు కూడా వచ్చాయి. దీంతో  అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. 
⇒ 2008 సెపె్టంబరు 22న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బి752 సియాటిల్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తుండగా విద్యుత్‌ సమస్య ఎదుర్కొంది. చికాగోలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ల్యాండింగ్‌ గేర్‌ దెబ్బతిన్నది. 192 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)