Breaking News

ప్రకృతి ఆరోగ్యనిధి చింత చిగురు

Published on Mon, 05/12/2025 - 01:09

ప్రకృతి మానవాళికి అందించిన వరాల్లో చింతచెట్టు ఒకటి. ఈ చెట్టు నీడను మాత్రమే కాక ఆరోగ్యాన్ని పంచే కాయలు, చిగురునూ అందిస్తుంది. ఇందులో చింతచిగురు రుచితోనే కాక పోషక విలువలతో ఆరోగ్యాన్ని కాపాడేదిగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యంలో చింతచిగురును భాగంగా చేస్తారు. దీంతో చెడు కొవ్వును తగ్గించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, జీర్ణక్రియను సులభతరం చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. 

అంతేకాక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలోనూ సాయపడుతుందని నమ్ముతారు. కాగా, సంప్రదాయ వైద్యంలో చింతచిగురును ఉపయోగిస్తారు. ఆయుర్వేద 
వైద్యవిధానంలో శరీరంలోని వేడి తగ్గించే, జీర్ణ సమస్యలను పరిష్కరించే గుణాలు కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. దీన్ని కషాయంగా చేసి జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇస్తారు. అంతేకాక చింతచిగురు శరీరంలోని విష పదార్థాలను తొలగించే డిటాక్స్‌ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందని చెబుతారు.     – కరకగూడెం

చింతచిగురు కోస్తున్న మహిళలు 

రుచి, ఆరోగ్యం
అద్భుతమైన రుచి కలిగి ఉండే చింతచిగురు ఆరోగ్య సమతుల్యానికి అండగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా చింతచిగురుతో కూరలు చేయడమే కాక పప్పు, చేపలు, చికెన్, మటన్‌ వంటి వాటిలోనూ కలిపి వండుతారు. ఇక చట్నీలు, పచ్చళ్లు కూడా పలువురు చేస్తారు. ‘సీ’విటమిన్‌ లోపంతో బాధపడేవారు టాబ్లెట్లకు బదులుగా చింతచిగురును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగా విటమిన్‌ అందుతుందని చెబుతారు. అందుకే ఇది గ్రామీణ జీవనంలో ఒక భాగంగా నిలుస్తోంది. చింతచిగురు మార్కెట్లలో మంచి ధర పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు ఈ చిగురును సేకరించి విక్రయించడం ద్వారా సీజనల్‌ ఆదాయాన్ని పొందుతారు.

పర్యావరణ పరిరక్షణ 
చింతచెట్టు కేవలం ఆహారం ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే కాక పర్యావరణ పరిరక్షణలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు తన దట్టమైన ఆకులతో వేసవి తాపాన్ని తగ్గించి నీడను అందిస్తుంది. అంతేకాక చింతచెట్టు వేర్లు నేల కోతను నివారించడంతో ఈ చెట్టు నేల సంý‡క్షణలో సాయపడుతుంది. అలాగే, పక్షులు, కీటకాలు ఆధారంగా నిలుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి.

వంటకాలకు ప్రత్యేక రుచి
చింతచిగురు అంటే చాలా ఇష్టం. ఇది వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. పప్పు, చేపలు, చికెన్, మటన్‌ వంటి కూరల్లో ఉపయోగిస్తాం. ప్రత్యేకంగా చింతచిగురు కూర కూడా వండుతాం. చింత చిగురుతో చట్నీలు, పచ్చళ్లూ చేస్తాం. ఆరోగ్యానికి మంచిదని నమ్ముతాం.   – పోలేబోయిన విజయలక్ష్మి,వెంకటాపురం

చిన్నప్పటి నుంచీ తీసుకుంటున్నా..  
నేను చిన్నప్పటి నుంచి చింతచిగురును ఆహారంలో తీసు కుంటున్నా. గతంలో లేత చిగురు కోసం అడవికి వెళ్లేవాళ్లం. చింత చిగు రుతో చేసే కూరలు రుచిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే సీజనల్‌లో తప్పకుండా చిగురును ఆహారంలో తీసుకోవాలి.      – పాయం రామయ్య, మొగిలితోగు చాలారకాల 

వంటలు చేస్తాం..  
మా ఇంట్లో చింత చిగురుతో చాలా రకాల వంటలు చేస్తాం. ప్రధానంగా పప్పుతో కలిపి వండటం ద్వారా మంచి రుచి వస్తుంది. చింత చిగురులో చాలా పోషకాలుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్‌లో పిల్లలు, పెద్దలు చిగురుతో చేసే వంటలను ఇష్టపడతారు.  – జాడి నర్సక్క, చొప్పల

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)