Breaking News

ఏఐకి అంతా చెప్పేస్తున్నారా?

Published on Fri, 04/04/2025 - 06:16

సాక్షి, స్పెషల్‌ డెస్క్: కొత్త వస్తువైనా, టెక్నాలజీ అయినా కంటపడితే దాని అంతుచూడందే కొందరికి నిద్ర పట్టదు. ప్రస్తుతం ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విషయంలోనూ చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. చాట్‌జీపీటీ, జెమినీ, గ్రోక్‌ వంటి ఏఐ టూల్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. పనులు చక్కబెట్టుకోవటం కోసం, నాలెడ్జ్‌ కోసం వీటిని వాడుకోవటం మంచిదే. కానీ, విచక్షణ లేకుండా వీటిని మన వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఏఐ టూల్స్‌కు ఏ సమాచారం ఇవ్వచ్చో.. ఏది మన సమాచారంతోనే ఎల్‌ఎల్‌ఎం టైనింగ్‌  టీచర్ల బోధన, పాఠ్యపుస్తకంలోని పాఠాలు, గైడ్లు, నిజ జీవిత అనుభవాలన్నింటి సాయంతో ఎలాగైతే విద్యార్థులు నేర్చుకుంటారో.. లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు (ఎల్‌ఎల్‌ఎం) కూడా అందుబాటులో ఉన్న సమాచారం, మనం వేసే ప్రశ్నల సాయంతో కొత్త విషయాలు నేర్చుకుంటాయి. దీన్నే ట్రైనింగ్‌ అని పిలుస్తుంటారు. చాట్‌జీపీటీ వంటివాటికి నిత్యవ్యవహారాల తాలూకు సమాచారం అందుబాటులో ఉంటే.. డాలీవంటి ఇమేజ్‌ జనరేటర్లకు వేల, లక్షల ఫొటోలు అందించి శిక్షణ ఇస్తుంటారు.

ఈ శిక్షణ ఎంత ఎక్కువ ఉంటే, వచ్చే ఫలితాలు అంత కచ్చితంగా ఉంటాయి. అయితే, ఈ శిక్షణ సందర్భంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా లభిస్తే దాన్ని కూడా అవి ఎక్కడో ఒకచోట వాడుకుంటాయి. కాబట్టి భవిష్యత్తులో మనకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఎల్‌ఎల్‌ఎంలు ‘మీ సంభాషణల్లో సున్నితమైన సమాచారం లేకుండా చూసుకోండి’అని, ‘మీకు మాత్రమే తెలిసిన సమచారాన్ని పంచుకోవద్దు’అని చెబుతుంటాయి.  

1, మీ ఇంటి అడ్రస్‌ లేదా ఫొన్‌ నంబర్, ఆధార్, ఓటర్‌ ఐడీ, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఎల్‌ఎల్‌ఎంలతో అస్సలు పంచుకోవద్దు. 2023లో చాట్‌జీపీటీ కోడ్‌లో చిన్న పొరబాటు దొర్లింది. ఫలితంగా ఇతరులు అడుగుతున్న ప్రశ్నలు అందరికి కనిపించడం మొదలైంది. హ్యాకర్లు ఈ సమాచారం చూస్తే ఇక అంతే సంగతులు.  

2, పాస్‌వర్డ్‌లు, లాగిన్‌ వివరాలను ఎల్‌ఎల్‌ఎంలతో పంచుకోవడం ఏమంత మంచిది కాదు. పడకూడని వారి చేతుల్లో పడితే ఈ సమాచారంతో మీ జేబులు ఖాళీ కావచ్చు. పాస్‌వర్డ్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ మాదిరిగా ఎల్‌ఎల్‌ఎంలలో ఈ వివరాలు సంకేత భాషలో స్టోర్‌ కావు. మోడల్‌ను రివ్యూ చేసేవారికి అందుబాటులో ఉంటాయి. లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎల్‌ఎల్‌ఎంలు పొరపాటుగానైనా ఈ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉంది.  

3, ఎల్‌ఎల్‌ఎంలతో పంచుకోకూడని మరో అంశం వృత్తిపరమైన సమాచారం. దీనివల్ల మనం పనిచేసే సంస్థలకు నష్టం జరగవచ్చు.  

4, వైద్యులు, లాయర్ల వద్ద ఏదీ దాచకూడదని చెబు తారు. కానీ, ఎల్‌ఎల్‌ఎంల వద్ద మాత్రం వైద్య సమాచారం అస్సలు పంచుకోకూడదు. ఎల్‌ఎల్‌ఎంలకు వైద్యపరమైన సమాచారాన్ని భద్రపరిచే చట్టాలు వర్తించకపోవచ్చు. ఫలితంగా మనం ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది.  

విరుగుడు మంత్రాలు ఎల్‌ఎల్‌ఎంలలో మన సంభాషణలు రికార్డు కాకుండా కొన్ని చిట్కాలున్నాయి.
⇒ చాట్‌జీపీటీ 4.0లో సంభాషణలను టెంపరరీ మోడ్‌లో ఉంచుకోవచ్చు.
⇒  డక్‌.ఏఐని వాడుకుంటే మన పేరు వివరాలు లేకుండా చేస్తుంది.

⇒  మైక్రోసాఫ్ట్‌ కో–పైలట్, గూగుల్‌ జెమినీలోసంభాషణలను రికార్డు చేస్తారు కానీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుని దాన్ని గోప్యంగా ఉంచుకోవచ్చు.

⇒  మన సంభాషణలను అప్పుడప్పుడూ డిలీట్‌ చేస్తుండటం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని నివారించవచ్చు.

⇒  చైనీస్‌ ఏఐ డీప్‌సీక్‌ మాత్రం మీ సంభాషణలన్నీ రికార్డు చేసి ట్రెయినింగ్‌ కోసం వాడుకుంటుంది. మార్పులు చేసుకునే, తప్పించుకునే అవకాశాల్లేవు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)