గుండె ఆరోగ్యాన్ని తెలిపే ‘లెక్క’!

Published on Fri, 04/18/2025 - 04:37

ఫిట్‌నెస్‌ బ్యాండ్లు లేదా స్మార్ట్‌ వాచీలు మన హృదయ స్పందనల్లో తేడాలను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండటం తెలిసిందే. అయితే ఓ చిన్న ‘లెక్క’సాయంతో అంతకన్నా మరింత కచ్చితత్వంతో గుండె ఆరోగ్యాన్ని గుర్తించే విధానాన్ని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇటీవల జరిగిన అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ (ఏసీసీ–2025) సమావేశంలో ఆ సరికొత్త ‘పారామీటర్‌’ను ప్రకటించారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఏమిటా పారామీటర్‌?
ఒక రోజులో ఒక వ్యక్తి వేసిన అడుగుల సంఖ్యను ఆ రోజు అతడి హృదయ స్పందనల సగటు రేటుతో భాగించడమే ఆ పారామీటర్‌ (చిన్న లెక్క). అలా వచ్చిన ఆ విలువను ‘డైలీ హార్ట్‌ రేట్‌ పర్‌ స్టెప్‌ (డీహెచ్‌ఆర్‌పీఎస్‌)గా పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి గుండె ఆరోగ్య స్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ పారామీటర్‌ దోహదపడుతుందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ఈ విలువ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుందంటున్నారు. డీహెచ్‌ఆర్‌పీఎస్‌ ఉండాల్సిన దానికంటే గుండె స్పందనలు ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా కూడా గుండె ఆరోగ్యం బాగోలేదనడానికి సూచిక అని చెబుతున్నారు. 

సుమారు 7 వేల మందికి సంబంధించిన 58 లక్షల పర్సన్‌–డేస్, వారు నడిచిన 5,100 కోట్ల అడుగులను విశ్లేషించి ఈ విషయాన్ని వారు చెప్పారు. అయితే ఇవి కేవలం మొదట చేసిన ఓ అధ్యయన ఫలితాలతో వెల్లడైన అంశాలేనని.. వాటిని పూర్తి రోగ నిర్ధారణగా చెప్పడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే వాటన్నింటిలోనూ ఇదే విషయం నిర్ధారణ అయితే భవిష్యత్తులో గుండె పరీక్షలకు దీన్నే ఓ ప్రామాణిక పారామీటర్‌గా తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  

డీహెచ్‌ఆర్‌పీఎస్‌ ఎక్కువగా ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలు ఇలా..
⇒ టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పు 2 రెట్లు ఎక్కువ 
⇒ గుండె వైఫల్యం ముప్పు 1.7 రెట్లు ఎక్కువ  
⇒ అధిక రక్తపోటు ముప్పు 1.6 రెట్లు ఎక్కువ ళీ కరొనరీ ఆర్టరీ డీసీజ్‌ ముప్పు 1.4 రెట్లు ఎక్కువ  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)