Breaking News

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అంబటి రాయుడు

Published on Thu, 12/28/2023 - 18:05

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

పాలిటిక్స్‌.. నా సెకండ్‌ ఇన్నింగ్స్‌: రాయుడు

అనంతరం సాక్షి టీవీతో క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడుతూ..రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి  జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు.

తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ గతంలో చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కాగా గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు.. విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతున్న విషయం తెలిసిందే.


చదవండి: రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)