Breaking News

మము బ్రోవమని...

Published on Fri, 01/31/2025 - 06:07

సామాన్యుడు.. ఏంటో ఎన్ని బడ్జెట్‌లు వచ్చినా.. దేశంలో వీడు మాత్రం ఎప్పుడూ సామాన్యుడిగానే మిగిలిపోతున్నాడు.. ఆకాశాన్నంటే ధరలతో..  వాటితో ఏ మాత్రం పొంతన కుదరని వేతనాలతో కుటుంబ బడ్జెట్‌ను కంట్రోల్‌ చేయలేక.. కిందా మీదా పడుతూనే ఉన్నాడు. మళ్లా బడ్జెట్‌ వస్తోంది. పరిశ్రమలకు చెందిన పెద్ద పెద్దోళ్లంతా అవి కావాలి.. ఇవి కావాలి అని అడుగుతున్నారు. సామాన్యుడూ వినతుల చిట్టాను విప్పాడు.

నను బ్రోవమంటున్నాడు..  ‘సీత’మ్మ తల్లీ.. తన మొర వింటావా మరి..

1. ధరలకు కళ్లెం వేయాలి..
కూరగాయలు, నూనెలు, పప్పులు, పాలు.. ఇలా నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిపోయాయి. దీంతో జేబుకు మరింత చిల్లు పడుతోంది. ముందు ముందు మరింతగా ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. పామాయిల్‌ ధర పెరగడం వల్ల బిస్కట్లు లాంటి ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ రేట్లూ పెరిగాయి. ఈ క్రమంలో ధరా భారం నుంచి ఉపశమనం కల్పించాలి. నూనెలపై దిగుమతి పన్ను తగ్గించడంతోపాటు ఇతర నిత్యావసరాల ధరల కట్టడికి చర్యలు ప్రకటించాలి. – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

2. వేతనాల్లో వేగం పెంచాలి..
ధరలు అలా ఉంటే.. జీతాల పెరుగుదల నత్తనడకను తలపిస్తోంది. జూనియర్ల నుంచి మధ్యస్థాయి ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగంలోని కార్మికుల వేతనాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఫిక్కీ, స్టాఫ్‌ సేవల సంస్థ క్వెస్‌ కార్ప్‌ గణాంకాల ప్రకారం... గత 12 నెలల్లో అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు కేవలం 3.4 శాతం, ఉద్యోగుల జీతాలు 6.5 శాతం పెరిగాయి. ఇంజనీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్, ఇన్‌ఫ్రా ఉద్యోగుల వేతనాలు 0.8శాతమే పెరిగాయి. ఈ క్రమంలో వేతనాల పెరుగుదలకు తోడ్పడేలా బడ్జెట్‌లో చర్యలు ఉండాలి.

3.ఉద్యోగ అవకాశాలు పెరగాలి
కరోనా సమయంలో పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి.. చాలా మంది వ్యవసాయం వైపు మళ్లినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. కానీ అక్కడా సరైన ఆదాయం లేక, తిరిగి ఉద్యోగం చేయడానికి సిద్ధమైనా... అవకాశాలు లభించని పరిస్థితి ఉంది. అదే సమయంలో చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు మరెందరో ఉన్నా రు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై  ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంతోపాటు ప్రైవేటు రంగంలో పెట్టుబ డులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది.  

4.పన్నుల మోత తగ్గించాలి
తక్కువ, మధ్యస్థాయి ఆదాయ వర్గాలపై పన్నుల భారం ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా వంట నూనెలపై పన్నుల తగ్గింపు, పెట్రోల్, డీజిల్‌ల ధరల నుంచి ఉపశమనం కల్పించాలనే డిమాండ్‌ చాలా రోజులుగా వినవస్తోంది. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయ పన్నులో మినహాయింపులు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ చర్యలతో మా జీవన ప్రమాణాలు పెరిగేందుకు వీలవుతుంది.

ఆర్థిక వ్యవస్థ మందగమనంతో..
2024–25లో దేశ ఆర్థికవృద్ధి 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసింది. కరోనా తర్వాతి కాలంలో ఇదే అతి తక్కువ వృద్ధి కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గడమూ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందగమనంతో మార్కెట్లో అన్ని రంగాల్లో డిమాండ్‌ తగ్గిపోయిందని అంటున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగితే.. క్షేత్రస్థాయిలో ఆర్థిక వృద్ధికి, మార్కెట్లో డిమాండ్‌ పెరగడానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ దిశగా అడుగులు పడితే... మాకు మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగా మీరు ఆలోచించాలి. 

#

Tags : 1

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)